Begin typing your search above and press return to search.

‘ఐకాన్’.. అల్లు అర్జున్ కాదటగా..?

By:  Tupaki Desk   |   21 April 2021 8:30 AM GMT
‘ఐకాన్’.. అల్లు అర్జున్ కాదటగా..?
X
అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ సినిమా రాబోతోందన్న ముచ్చట మూడేళ్ల కిందటిది. దర్శకుడు శ్రీరామ్ వేణు బన్నీకి కథ వినిపించగా ఓకే చెప్పాడు కూడా. నిర్మాత దిల్ రాజ్ ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక, సినిమా మొదలు కావడమే తరువాయి అనుకుంటుండగా.. త్రివిక్రమ్ లైన్లోకి వచ్చాడు. ‘అలవైకుంఠ పురములో’ సినిమా బయటకు వచ్చింది. ఐకాన్ మరుగున పడిపోయింది.

ఇప్పుడు శ్రీరామ్ వేణు-దిల్ రాజు కాంబో వ‌కీల్ సాబ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకోవ‌డంతో.. ఐకాన్ మూవీ మళ్లీ డిస్క‌ష‌న్లోకి వ‌చ్చింది. వ‌కీల్ సాబ్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న దిల్ రాజు.. త‌మ నెక్స్ట్ మూవీ ‘ఐకాన్’ అని ప్ర‌క‌టించారు. అయితే.. అందరూ ఈ కాంబో పట్టాలెక్కినట్టే అనుకున్నారు. కానీ.. అందులో చిన్న లాజిక్ ను ఎవ్వరూ గమనించలేదట.

తమ బ్యానర్లో నెక్స్ట్ సినిమా ‘ఐకాన్’ అన్నాడుగానీ.. అందులో హీరో అల్లు అర్జున్ అని చెప్పలేదుగా అని ఇప్పుడు లా పాయింట్ లాగుతున్నారు చాలా మంది. వాస్తవం కూడా అదేనట. ఈ ప్రాజెక్టులో నటించడానికి బన్నీ నో చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో పరిస్థితుల ప్రకారం ఓకే చెప్పిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి ప‌రిస్థితుల ప్ర‌కారం నో చెప్పాడ‌ట‌.

‘అల‌వైకుంఠ పుర‌ము’లో చిత్రంతో త‌న స్టార్ డ‌మ్ మ‌రింత‌గా పెరిగింద‌ని బ‌న్నీ భావిస్తున్నాడ‌ట‌. దీంతో.. రెమ్యునరేషన్ కూడా పెంచాలని కోరాడట. అంతేకాదు.. స్క్రిప్టులో కూడా ఇప్పుడు మార్పులు చేయాలని చెప్పాడట. ఈ రెండు విషయాలకు దర్శక, నిర్మాతలు ఒప్పుకోలేదట. దీంతో.. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.

అయినా పర్వాలేదని, మరో హీరోతో ఇదే ప్రాజెక్టును లాంఛ్ చేయాలని చూస్తున్నారట దిల్ రాజు, వేణు శ్రీరామ్. ఈ కథకు సూట్ అయ్యే హీరోను వెతికే పనిలో పడ్డారట. అంతా అనుకున్నట్టు జరిగితే.. ఈ కరోనా గోల పోయిన తర్వాత ‘సరికొత్త ఐకాన్’ తెరమీదకు రావొచ్చని భోగట్టా. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.