Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఐకానిక్‌ స్టార్‌ బ్యూటీఫుల్‌ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   2 Oct 2021 2:30 AM GMT
పిక్ టాక్‌ : ఐకానిక్‌ స్టార్‌ బ్యూటీఫుల్‌ ఫ్యామిలీ
X
ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన పిల్లలు మరియు కుటుంబంకు కావాల్సినంత సమయంను ఇస్తూనే ఉంటాడు. ఆయన ఇటీవల తన భార్య స్నేహా రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాడు. పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు అంతా కలిసి హాలీడేను ఎంజాయ్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలను రెగ్యులర్‌ గా స్నేహా రెడ్డి షేర్‌ చేస్తూ వచ్చింది. తాజాగా మరోసారి స్నేహారెడ్డి ఈ ఫొటోలను షేర్‌ చేసింది. అల్లు అర్జున్ మరియు ఆయన క్యూట్ ఇద్దరు పిల్లలు ఇంకా స్నేహా రెడ్డి ఉన్న ఈ పిక్స్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందమైన ఫ్యామిలీ.. బ్యూటీ ఫుల్ ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ అల్లు ఫ్యామిలీ పై ప్రశంసలు కురిపించారు.

ఈ ఫొటోను షేర్‌ చేసిన స్నేహారెడ్డి.. అద్బుతమైన పుట్టిన రోజు ఇష్టమైన వారు పక్కన ఉండగా జరిగిన ఈ బర్త్‌ డే మరింత స్పెషల్‌ అయ్యిందని కామెంట్ పెట్టింది. పిల్లలు మరియు బన్నీ కలిసి స్నేహారెడ్డి తో కేక్ కట్ చేయించే ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇంకా అందమైన అక్కడి అందాలను చూపించిన స్నేహా రెడ్డి తన సంతోషాన్ని ఫాలోవర్స్ తో పంచుకుంది. ఆకట్టుకునే అందమైన ఈ ఫ్యామిలీ అందమైన లొకేషన్‌ లో అంతకు మించి ప్రత్యేక సందర్బంలో ఉండటం ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్‌ మరియు స్నేహా రెడ్డిల జోడీ ఎప్పుడు కూడా ది బెస్ట్ అంటూ ఉంటారు. ఇక వారితో వారి పిల్లలు ఉంటే కళ్ల నిండుగా ఉంటుంది అనిపిస్తుంది.

ఇక అల్లు అర్జున్‌ పుష్ప సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ కు చిన్న గ్యాప్ ఇచ్చిన బన్నీ అలా భార్య బర్త్‌ డే వేడుకను నిర్వహించేందుకు వెళ్లాడు. అక్కడ సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేశాడు. అతి త్వరలో మళ్లీ పుష్ప చిత్రీకరణలో జాయిన్ కాబోతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప నుండి దసరాకు రెండవ పాట వస్తుందనే టాక్ కూడా వస్తుంది. బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకోబోతున్న పుష్ప లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండా ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ గా కనిపించబోతున్నాడు.