Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: రాజ్ తరుణ్ పై ఫీలింగ్ లేదంటున్న షాలిని!
By: Tupaki Desk | 17 Dec 2019 12:16 PM GMTరాజ్ తరుణ్- షాలిని పాండే హీరో హీరోయిన్లుగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇద్దరిలోకం ఒకటే'. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది. కాసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ ఆరంభంలో రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్ లో "లైఫ్ ప్రతివాడికి ఒక మొమెంట్ లో ఎక్స్ పెక్ట్ చెయ్యని సర్ ప్రైజ్ ఇస్తుందంట" అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. ఈ సమయంలో 'ఖుషి' టైపులో ఇద్దరు పసికందులు పక్క పక్కనే ఉన్న ఉయ్యాలల్లో పడుకొని ఉంటారు. నెక్స్ట్ సీన్ కొంచెం పెద్దయిన పిల్లలుగా ఉంటారు. అప్పుడు పాపకు బాబు ఒక ఫోటో తీస్తాడు. పాప.. బాబుకి కిస్సుకూడా ఇస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో వారే మన హీరో హీరోయిన్లుగా మారతారు. "ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది?" అని షాలిని అడిగితే "18 ఇయర్స్" అంటూ బదులిస్తాడు రాజ్ తరుణ్. ఇక ఇద్దరూ లవర్స్ లాగా తిరుగుతూ ఉంటారు. 'యూ ఆర్ మై హార్ట్ బీట్' అంటూ ఓ సూపర్ మెలోడీ సాంగ్ కూడా వేసుకుంటారు.
అంతా సాఫీగా ఉంది అనుకున్న ఈ సమయంలో "ఐ లవ్ యూ వర్ష" అంటూ రాజ్ తరుణ్ తన ప్రేమను షాలినికి చెప్పేస్తాడు. హీరోయిన్ ఒప్పుకాదు. ఒక తిరకాసు పెడుతుంది. "పరిచయం.. స్నేహం ఇవన్నీ కో ఇన్సిడెంట్స్. ప్రేమించట్లేదంటే నువ్వు నచ్చట్లేదని కాదు. నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసేంత ఫీలింగ్ లేదని" అంటూ ఒక ఆటం బాంబు పేలుస్తుంది. మరి ఇలాంటి ఊహాతీతమైన భావజాలంతో ఉన్న కఠినమైన ప్రేయసి ప్రేమను రాజ్ తరుణ్ ఎలా గెలుచుకున్నాడు అనేది కథ. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ రెండూ ఆహ్లాదకరంగా ఉన్నాయి. ట్రైలర్ ఓకే కానీ రెండు మూడు సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి. మరి రాజ్ తరుణ్-షాలిని జోడీ లవ్ స్టోరీ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. అంతలోపు ట్రైలర్ పై ఒక లుక్కేయండి.