Begin typing your search above and press return to search.

ఇద్ద‌రి లోకం ఒక‌టే.. సెన్సార్ రిపోర్ట్

By:  Tupaki Desk   |   29 Nov 2019 11:41 AM GMT
ఇద్ద‌రి లోకం ఒక‌టే.. సెన్సార్ రిపోర్ట్
X
వ‌రుస ప‌రాజ‌యాలు రాజ్ త‌రుణ్ కెరీర్ కి కొంత ప్ర‌తిబంధ‌కంగా మారాయి. 2018లో `ల‌వ‌ర్` అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. అయినా మ‌రోసారి ప్రేమ‌క‌థా చిత్రంతోనే అత‌డు ల‌క్ చెక్ చేసుకోబోతున్నాడు. రాజ్ త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `ఇద్ద‌రిలోకం ఒక‌టే`. అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే ఈ చిత్రంలో క‌థానాయిక‌. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్లు రిలీజై ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల కానుంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఫీల్ క‌నెక్ట‌యితే యువ‌త‌రాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగితే విజ‌యం ద‌క్కిన‌ట్టే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ.ఆర్.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మిక్కీ.జె సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా అంద‌రి కంటే రాజ్ త‌రుణ్ కి ఎంతో ఇంపార్టెంట్. వైఫ‌ల్యాల నుంచి బ‌య‌ట‌ప‌డి గాడి త‌ప్పిన‌ కెరీర్ ని ట్రాక్ లో పెట్టాల్సిన స‌న్నివేశం ఉంది. మ‌రి ఈ యంగ్ హీరో ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటాడు? అన్న‌ది చూడాలి.