Begin typing your search above and press return to search.

మహేష్‌ కోసం ఆమె పాడిన పాట బాగుందే

By:  Tupaki Desk   |   13 April 2018 1:45 PM GMT
మహేష్‌ కోసం ఆమె పాడిన పాట బాగుందే
X

చాలా సినిమాల్లో నటిగా కూడా అలరించిన హాటీ ఆండ్రియా జెరీమియా ఉంది చూశారూ.. రెగ్యులర్ గా కంపోజర్ దేవిశ్రీప్రసాద్ కోసం పాటలు పాడుతూనే ఉంటుంది. ఆమె వాయిస్ లోని ఉన్న మత్తుతో భలే భలే స్లో పాటలను కాస్త శృంగారభరితంగా పాడిస్తుంటాడు డిఎస్పీ. అయితే ఈసారి మాత్రం.. ఒక హుషారైన పాటను ఆమెకు అప్పగించాడు.

'భరత్ అను నేను' సినిమాలో హీరోయిన్ కైరా అద్వానీ.. సిఎం మహేష్‌ బాబుతో ప్రేమలో పడగానే.. అతన్ని గురించి ఒక పాట పాడుకుంటుంది. ఇదంతా కలలాగా ఉందే అని చెప్పడానికి ఆమె పాడే పాటను.. 'అర్రెరే ఇది కలలా ఉందే' అంటూ ఆండ్రియా ఆలపించింది. పాటలో మత్తు.. దేవిశ్రీ అందించిన బీట్ అండ్ స్ర్టింగ్స్.. బాగున్నాయనే చెప్పాలి. మొత్తానికి తెలుగులో మరోసారి ఆండ్రియా ఇంప్రెస్ చేసింది. అందరివాడైన అందని వాడైనా.. ఏకాంతంలో నాతో ఉంటాడే' అంటూ రామజోగయ్య శాస్ర్తి కూడా తన చలాకితనం ఈ పాటలోని మాటల్లో చూపించాడు.

ఇక గతంలో దడ సినిమా కోసం దీవాళి దీపాన్ని.. ఎవడు సినిమాలో 'ఓయే ఓయే' వంటి పాటలను అమ్మడు ఆలపించిన సంగతి తెలిసిందే.

వీడియో ని చూడటానికి క్లిక్ చేయండి