Begin typing your search above and press return to search.
మహర్షి చెప్పిన కథ - లిరికల్ వీడియో
By: Tupaki Desk | 4 May 2019 7:29 AM GMTప్రిన్స్ ఫ్యాన్స్ కొండంత ఆశలతో విడుదల కోసం ఎదురు చూస్తున్న మహర్షి ఆడియోలోని చివరి పాటను థీమ్ సాంగ్ రూపంలో విడుదల చేశారు. నిజానికి ఇది జ్యూక్ బాక్స్ లో లేదు. అందుకే కేవలం బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే చిన్న బిట్ అనుకున్నారు కాని ఆశ్చర్యకరంగా ఇదే బెస్ట్ సాంగ్ అనిపించేలా సాగడం విశేషం.
ఇదే కదా నీ కథ ఓ నీటి బిందువేగా నువ్వు వెతుకుతున్న సంపద అంటూ కథలో ఉద్దేశాన్ని మహర్షి జీవిత లక్ష్యాన్ని ఇందులో పొండుపరిచిన తీరు హత్తుకునేలా ఉంది. విజయ్ ప్రకాష్ గాత్రంలో శ్రీమణి అందించిన సాహిత్యం బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ తన స్థాయి ఇందులో పాటలు కంపోజ్ చేయలేదే అన్న కంప్లయింట్ ఫస్ట్ ట్రాక్ నుంచే వస్తోంది. ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా ఏది అతని రేంజ్ లో లేవని కామెంట్స్ గట్టిగానే వినిపించాయి
ఇప్పుడీ పాట వాటిని పూర్తిగా తుడిచిపెట్టేలా పాజిటివ్ వైబ్రేషన్స్ తో సాగడం విశేషం. ఇంకో రెండు మూడు పాటలు ఇదే స్థాయిలో ఉండి ఉంటే మహర్షి ఆల్బం రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించేదేమో. ఏదైతేనేం అభిమానులు గర్వంగా చెప్పుకునే ట్రాక్ అయితే వచ్చింది. కాస్త లోతుగా విశ్లేషిస్తే మహర్షి అంత పెద్ద సామ్రాజ్యాన్ని వదిలి ఇండియాలోని పల్లెకు ఎందుకు వచ్చాడన్న అర్థం దొరుకుతుంది.
రైతులకు అరుధైపోయిన నీటి చినుకు కోసం మహర్షి పడే తపన అతను చేసే యజ్ఞం నేపధ్యంలో రైతుల వెతలను కళ్ళకు కట్టినట్టు శ్రీమణి సాహిత్యంలో పొందుపరిచిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇంకో ఐదు రోజుల్లో రిలీజ్ ఉందనగా ఇలాంటి పాట రావడం మంచి ఉత్సాహాన్ని ఇచ్చేదే