Begin typing your search above and press return to search.

'ఇడియట్స్' ఫస్ట్ లుక్: రియల్ హీరోలతో కలర్స్ స్వాతి..!

By:  Tupaki Desk   |   5 May 2022 8:01 AM GMT
ఇడియట్స్ ఫస్ట్ లుక్: రియల్ హీరోలతో కలర్స్ స్వాతి..!
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా.. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ని బ్యాంక్ రోల్ చేస్తున్నారు. 'రావణాసురుడు' 'డెవిల్' వంటి భారీ బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటుగా.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈరోజు గురువారం ''ఇడియట్స్'' అనే క్రేజీ టైటిల్ తో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ఈ ప్రొడక్షన్ వెంచర్ లో అమోఘ ఆర్ట్స్ మరియు MNOP సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

''ఇడియట్స్'' చిత్రంలో కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇది తెలంగాణా పల్లెటూరి నేపథ్యంలో ఇన్నోసెంట్ ప్రేమకథతో ఫన్నీ ఎలిమెంట్స్ తో కూడిన న్యూ ఏజ్ సినిమా అని మేకర్స్ తెలిపారు. ఇందులో నిఖిల్ దేవాదుల - సిద్ధార్థ్ శర్మ - శ్రీ హర్ష - నిత్య శ్రీ -సురేష్ - రాజేంధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా 'ఇడియట్స్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ప్రముఖ తారాగణం అంతా కనిపిస్తున్న ఈ పోస్టర్ లో.. ప్రతి పాత్ర విభిన్న భావోద్వేగాలను కలిగి ఉంది. ఇందులో స్వాతితో పాటుగా.. త్రీ ఇడియట్స్ నిఖిల్ దేవాదుల - సిద్ధార్థ్ శర్మ - శ్రీ హర్ష మరియు మరికొంత మంది ఉన్నారు.

పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబంభించే ఈ పోస్టర్ లో స్కూల్ కు వెళ్లే అబ్బాయి అమ్మాయిని.. అలానే ఓ బెంచ్ పై ముచ్చటిస్తున్న ప్రేమ పక్షులను కూడా ఈ చూడవచ్చు. ‘ఇడియట్స్’ టైటిల్ క్రేజీగా అనిపించినా.. పోస్టర్ మాత్రం ఆహ్లాదకరంగా ఉంది. 'ది రియల్ హీరోస్' అనేది సినిమా క్యాప్షన్.

నవీన్ మేడారం షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సిద్దార్థ్ సదాశివుని సంగీతం సమకూరుస్తున్నారు. అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. అరుణ్ తాచోత్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ‘ఇడియట్స్’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.