Begin typing your search above and press return to search.
ఆ రెండూ ప్రూవ్ చేయకపోతే బాలీవుడ్ ఖతం!
By: Tupaki Desk | 7 Sep 2022 1:30 AM GMTబాలీవుడ్ లో ప్రస్తుతం సంధికాలం కొనసాగుతోంది. ఏ సినిమా రిలీజైనా అక్కడ రిజల్ట్ మాత్రం ఒక్కటే. అగ్ర హీరోల సినిమాలు సైతం డిజాస్టర్ రిజల్ట్ తో తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పుడు హిందీ సినిమాలను మించి ఉత్తరాదిన తెలుగు సినిమాలు ఆడుతున్నాయంటే కంటెంట్ పరంగా హిందీ ఫిలింమేకర్స్ ఫెయిల్యూర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే బ్యాన్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగులు కూడా ఇందుకు ఇతోధికంగా సహకరిస్తున్నాయన్న వాదనా లేకపోలేదు.
సరిగ్గా ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో రెండు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో రణబీర్ కపూర్- ఆలియా జంట నటించిన బ్రహ్మాస్త్ర పై భారీ హైప్ నెలకొంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ రిలీజ్ కి ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడ భాషల్లో విడుదలవుతోంది.ఈ మూవీ విజయంపై రణబీర్- ఆయాన్ ముఖర్జీ- కరణ్ జోహార్ బృందం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఓపెనింగులపైనా అంచనాలున్నాయి.
అంతేకాదు.. ఈ మూవీ తర్వాత కేవలం మూడు వారాల గ్యాప్ తో వస్తున్న హృతిక్ రోషన్-సైఫ్ అలీఖాన్ ల విక్రమ్ వేద పైనా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లుక్ లు విడుదల కాగా అభిమానుల్లో అంచనాలు పెంచాయి. బ్రహ్మాస్త్ర తో పాటు విక్రమ వేద కూడా విజయం సాధిస్తేనే బాలీవుడ్ కొంతవరకూ కుదుటపడినట్టు. అగ్ర హీరోలు రణబీర్ .. హృతిక్ పైనే ఇప్పుడు బాలీవుడ్ ఆశలన్నీ.. కానీ ఏం జరగబోతోంది? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
మరోవైపు తాజా సమాచారం మేరకు.. హృతిక్ రోషన్-సైఫ్ అలీఖాన్ ల విక్రమ్ వేద ట్రైలర్ బ్రహ్మాస్త్ర షోలకు ముందే సినిమా థియేటర్లలో ప్రదర్శించనున్నారని తెలిసింది. ప్రస్తుతం ముంబై పరిశ్రమ ఈ నెలలో విడుదలల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రానున్న వాటిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలు బ్రహ్మాస్త్ర - విక్రమ్ వేద ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానున్నాయి. రణబీర్ కపూర్ - అలియా భట్ నటించిన 'బ్రహ్మాస్త్ర' ఈ శుక్రవారం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. కానీ విక్రమ్ వేద ట్రైలర్ ఒక రోజు ముందే.. అంటే సెప్టెంబర్ 8న విడుదల కానుంది. ఇప్పటికే విక్రమ్ వేద టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది.
విక్రమ్ వేద ట్రైలర్ ని 'బ్రహ్మాస్త్ర' ఆడుతున్న థియేటర్లలో ప్రదర్శిస్తారు. సూపర్ హీరో సినిమా బ్రహ్మాస్త్ర ప్రింట్ లకు ట్రైలర్ ని జోడించరు.. కానీ బ్రహ్మాస్త్ర షో ప్రారంభం కావడానికి ముందే ట్రైలర్ ను ప్లే చేయమని థియేటర్ ప్రదర్శకులను కోరారు. ఎగ్జిబిటర్లు 'విక్రమ్ వేద' హిట్ అవుతుందని భావిస్తున్నందున ఈ అభ్యర్థనకు అంగీకరించారని బాలీవుడ్ మీడియా కథనాలు వెలువరిస్తోంది.
రణబీర్ 'బ్రహ్మాస్త్ర' విస్తృతంగా విడుదల కానుంది.. హైప్ అద్భుతంగా ఉంది. అందుకే తమ సినిమా ట్రైలర్ కి విపరీతమైన వ్యూయర్ షిప్ వస్తుందని విక్రమ్ వేద నిర్మాతలు భావించారు. సినిమా ప్రేక్షకులు కూడా పెద్ద స్క్రీన్ పై ట్రైలర్ ని వీక్షించి థియేటర్లకు వచ్చేందుకు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నారు. అదే సమయంలో 'బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్'... 'అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్' ట్రైలర్ లు బ్రహ్మాస్త్ర ప్రింట్ లతో జతచేశారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనర్థం వీక్షకులు బ్రహ్మాస్త్రాన్ని చూసేందుకు సాహసం చేస్తున్నప్పుడు 2022లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు చిత్రాల ట్రైలర్ లను చూడగలుగుతారనే!
విక్రమ్ వేద హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ నటించారు. అదే పేరుతో తెరకెక్కి విజయం సాధించిన తమిళ చిత్రానికి అధికారిక రీమేక్ ఇది. ఆసక్తికరంగా ఈ చిత్రం టీజర్ ఆగష్టు రెండవ వారంలో విడుదల కావాల్సి ఉన్నా వీలుపడలేదు. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ... అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' షోలకు ముందు ప్రదర్శించాల్సిన టీజర్ ను ప్లాన్ మార్చి ఆగస్టు 24న విడుదల చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను బ్రహ్మాస్త్ర మూవీతో ప్రదర్శించనుండడం ఆసక్తికరం. ఈసారి ప్రణాళికలలో ఎటువంటి మార్పు ఉండదు. విక్రమ్ వేద ట్రైలర్ సెప్టెంబర్ 8న ఆన్ లైన్ లో విడుదల కానుంది. మేకర్స్ ఆ మేరకు వివరాల్ని అధికారికంగా ప్రకటించారు.
ట్రైలర్ విడుదల కోసం ఏదైనా ఈవెంట్ ఉంటుందా? అని ప్రశ్నిస్తే.. దానికి ఎలాంటి సమాధానం లేదని తెలిసింది. ఇక బ్రహ్మాస్త్ర చిత్రం వీక్షించే వాళ్లకు బ్లాక్ పాంథర్ 2 - అవతార్ 2 ట్రైలర్లతో విజువల్ గ్లింప్స్ ని వీక్షించే సౌలభ్యం ఉంది. ఈ రెండు హాలీవుడ్ చిత్రాలు అత్యంత క్రేజుతో విడుదల కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ వసూళ్లు సాధించే సత్తా ఉన్న చిత్రాలివి. అలాగే హిందీ చిత్రం 'విక్రమ్ వేద' ట్రైలర్ హిందీ ఆడియెన్ కి ప్రత్యేక బహుమతి అని అనుకోవాలి. బ్రహ్మాస్త్ర- విక్రమ్ వేద చిత్రాలు బాలీవుడ్ ని క్రైసిస్ నుంచి కాపాడుతాయేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.