Begin typing your search above and press return to search.
చరణ్ పాత్ర చనిపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా?
By: Tupaki Desk | 25 May 2021 6:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇరువురిని ఒకే ఫ్రేమ్ లో వీక్షించే అవకాశం కలిగితే మెగాభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. ఇంతకుముందు కేవలం అతిథి పాత్రల్ని మాత్రమే వీక్షించారు. కానీ ఈసారి పూర్తి నిడివి సినిమాలో ఆ ఇద్దరూ కనిపించబోతున్నారు. భారీ మల్టీస్టారర్ ఆచార్యతో తండ్రి కొడుకుల్ని పూర్తి నిడివి ఉన్న సినిమాలో చూడాలన్న మెగాభిమానుల ఆకాంక్ష నెరవేరనుంది.
చరణ్ పాత్ర ఆచార్యలో 40 నిమిషాల నిడివితో ఉంటుంది. ఫస్టాఫ్ లో తక్కువగా కనిపించినా కానీ సెకండాఫ్ అంతా చరణ్ పైనే నడుస్తుంది. అసలు ఇది చరణ్ పాత్రపై నడిచే కథ. కానీ చిరు దానికి కొనసాగింపు పార్ట్ ని పూర్తి చేస్తారు! అంటూ కొరటాల హింట్ ఇచ్చేయడంతో ఆచార్య కథ గురించి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
అయితే మరో షాకింగ్ ఎలిమెంట్ తాజాగా మెగాభిమానుల్లో చర్చకు వచ్చింది. ఇందులో చరణ్ పాత్ర విలన్లతో జరిగే పోరాటంలో చనిపోతుంది. ఆ తర్వాత ఆ బాధ్యతను తీసుకుని చిరు కథను ముగిస్తారని చివరికి ఆయన ఎలా విలన్ల భరతం పట్టారు? అన్నది తెరపై చూడాలని కథ గురించి లీకులిచ్చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో చిరు-చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించరు. కేవలం కథను డ్రైవ్ చేసేవారిగా లీడ్ పాత్రల్లో కనిపిస్తారు. మరో 10రోజుల చిత్రీకరణ పూర్తయితే సినిమా చిత్రీకరణ పూర్తయినట్టేనని కొరటాల తెలిపారు. ఆగస్టులో మూవీ రిలీజయ్యేందుకు ఆస్కారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.