Begin typing your search above and press return to search.
రోజుకు 16 కోట్లు సంపాదిస్తే.. అలాగే చేసేవాణ్నిః హీరో
By: Tupaki Desk | 17 April 2021 12:30 AM GMTఎదుటి వారిపై నెగెటివ్ కామెంట్లు చేయడమే కొందరు ఆవారాల పనిగా మారిపోయింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారిపై వల్గర్ కామెంట్లు చేయడంతోపాటు.. వెకిలి చేష్టలకు పాల్పడడం కూడా రెగ్యులర్ అయిపోయింది. తాజాగా.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ పై కామెంట్ చేశాడో నెటిజన్.
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి ఫొటోను షేర్ చేసిన అర్జున్.. దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టుపై వెకిలి రాతలు రాసుకొచ్చాడో ఆకతాయి. 'నీ ఒక్క రోజు సంపాదనతో అతడిని కాపాడొచ్చుకదా..' అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనికి కూల్ గా స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు అర్జున్ కపూర్.
''నేను గనక రోజుకు రూ.16 కోట్లు సంపాదిస్తే.. ఈ పోస్టు చేయాల్సిన అవసరమే వచ్చేది కాదు. అయినా.. నా వంతు సహాయం చేశాను. వీలైతే మీరు కూడా సహాయం చేయండి'' అంటూ రిప్లే ఇచ్చాడు. అర్జున్ ఇచ్చిన ఈ సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పనికిమాలిన వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తమవంతు సహకారం అందిస్తామని కామెంట్ చేస్తున్నారు.