Begin typing your search above and press return to search.
ఇది కంటిన్యూ అయితే థియేటర్లకు కష్టమే!
By: Tupaki Desk | 20 Nov 2022 3:30 PM GMTకరోనా తరువాత తెలుగు ప్రేక్షకుల్లో విప్లవాత్మక మార్పులు చోటుకున్నాయి. ఓటీటీల ప్రభావం మొదలైన తరువాత ప్రేక్షకులు థియేటర్లకు మునుపటిలా రావడానికి ఇష్టపడటం లేదు. అంతే కాకుండా పెరిగిన టికెట్ రేట్లు, ఫుడ్, డ్రింక్స్.. బేవరేజర్స్ ఖర్చు చుక్కలని అంటుతూ ఓ ఫ్యామిలీ థియేటర్ కి వెళ్లాలంటే కనీసం 15 వందల నుంచి రెండు వేల వరకు ఖర్చవుతోంది. దీంతో ఇంత ఖర్చు పెట్టి థియేటర్లకు రావడం కంటే అదే మొత్తాన్ని ఓటీటీలకు సబ్స్ స్క్రిప్షన్ చేసుకుంటే ఇంటిల్లిపాదీ కలిసి ఇంట్లోనే సినిమా చూడొచ్చని భావిస్తున్నారు.
దీంతో గత కొన్ని నెలలుగా థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి మరీ తక్కువైపోతోంది. స్టార్స్ సినిమాలకు కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. పబ్లిక్ టాక్ సూపర్.. థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడొచ్చని ప్రచారం జరిగిన సినిమాకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పెరుగుతున్న మినీ థియేటర్ కల్చర్ థియేటర్ల యాజమాన్యాలకు కొత్త చిక్కలు తెచ్చిపెట్టేలా వుంది. సినిమాలతో పాటు నచ్చిన క్రికెట్ మ్యాచ్ అని ఇంట్లోనే వుండి మినీ స్క్రీన్ పై వీక్షించాలనే భావన రోజు రోజుకీ హైదరాబాదీయులలో పెరిగిపోతోంది.
నచ్చిన ఓటీటీల్లో నచ్చిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లని కూడా చూసే విధంగా ఇంట్లోనే మినీ థియేటర్లని ఏర్పాటు చేయడానికి 'స్టార్ ట్రాక్' సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంస్థ అపార్ట్ మెంట్ లలో, కమ్యూటీల్లో.. ఇండిపెండెంట్ హౌస్ లలో విలాసవంతమైన మినీ థియేటర్లని ఏర్పాటు చేస్తోంది. అర్డర్ లని బట్టి అందుబాటు ధరల్లో ఈ సంస్థ మినీ థియేటర్లని అత్యంత విలాస వంతమైన వసతులతో ఉర్పాటు చేస్తోంది.
సికింద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో 'డెమో' థియేటర్ ని ఏర్పాటు చేసి అందరికి డెమో ఇస్తోంది. 143 అంగుళాల స్క్రీన్, 15 డాల్బీ స్టీరియో సిస్టమ్ స్పీకర్ లు...విలాసవంతమైన రిక్లైనర్స్..భద్రతకు సెక్యురిటీ కెమెరాలని కూడా ఏర్పాటు చేశారు. ఈ సిస్టమ్ ని తమ ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఫ్యామిలీతో వచ్చి సినిమాలని, సిరీస్ లని డెమోలో భాగంగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులు కూర్చుని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని థియేటర్లకు వెళ్లకుండానే పొందేయోచ్చు.
దీంతో చాలా మంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్.. హై క్లాస్ ఫ్యామిలీస్ ఈ సిస్టమ్ కు ఎడిక్ట్ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. ఇంట్లో ఇప్పుడు జియో ఫైబర్ వచ్చేయడంతో సిరీస్ లు, సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు 'స్టార్ ట్రాక్' కు భారీ స్థాయిలో అలవాటు పడిపోయి మినీ థియేటర్లకు అర్డర్ లు ఇచ్చేస్తే థియేటర్లకు కష్టకాలం మొదలైనట్టేనని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.