Begin typing your search above and press return to search.

జక్కన్న రావాలని ఫిక్స్ అయితే అందరూ సైడ్ అవ్వాల్సిందే..!

By:  Tupaki Desk   |   21 May 2021 8:30 AM GMT
జక్కన్న రావాలని ఫిక్స్ అయితే అందరూ సైడ్ అవ్వాల్సిందే..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభనతో అనుకున్న సమయానికి రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్టే షూటింగ్ కూడా నిలిచిపోవడంతో వచ్చే ఏడాది సమ్మర్ కు 'ఆర్.ఆర్.ఆర్' రెడీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్టుగా వచ్చిన ట్రిపుల్ ఆర్ అప్డేట్ తో ఈ చిత్రాన్ని ఇంకా దసరా బరిలో నిలపాలనే జక్కన్న అండ్ టీమ్ ఆలోచిస్తున్నట్లు అర్థం అవుతుంది.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా 'కొమురం భీమ్' పోస్టర్ RRR టీమ్ విడుదల చేసింది. ఆకాశంలోకి బల్లెం ఎక్కుపెట్టిన గోండ్రు బెబ్బులి భీమ్ ఇంటెన్స్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ పోస్టర్ లో 2021 అక్టోబర్ 13న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే పరిస్థితులు అనుకూలిస్తే విజయదశమికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి జక్కన్న సిద్ధంగా ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇటీవల ఎన్టీఆర్ సైతం అక్టోబర్ కు వచ్చే ఛాన్సెస్ ఇప్పటికీ ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే కనుక జరిగితే దసరా స్లాట్ కోసం ఎదురు చూస్తున్న చాలా సినిమాలు సైడ్ అవ్వాల్సిందే.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మిగతా పెద్ద సినిమాలన్నీ ఆ రిలీజ్ డేట్ కోసం కర్చీఫ్ వేయడానికి రెడీ అయ్యాయి. యష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'కేజీఎఫ్ 2' జులై నుంచి వాయిదా పడితే అక్టోబర్ లోనే రావాలని చూస్తోంది. అలానే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప' ఫస్ట్ పార్ట్ ని దసరా సీజన్ కి తీసుకురావాలని చూస్తున్నారు. 'ఆచార్య' 'నారప్ప' 'అఖండ' చిత్రాలు కూడా దసరా ని టార్గెట్ గా పెట్టుకునే అవకాశం ఉందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్ ట్రాక్‌ లోకి వస్తే మాత్రం మిగతా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ ప్లాన్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ కు కరోనా మహమ్మారి కోపరేట్ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.