Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ లేకపోతే నేను లేను: 'ఆహా' వేదికపై అల్లు అర్జున్
By: Tupaki Desk | 3 Nov 2021 3:34 AM GMTతెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా 'ఆహా' తన రూపురేఖలను మార్చుకుంటూ దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెబ్ సిరీస్ లతో .. సినిమాలతో .. కామెడీ షోలతో .. గేమ్ షోలతో తన స్థాయిని పెంచుకుంటూ వెళుతోంది. స్టార్ హీరోల సందడితో .. స్టార్ హీరోయిన్స్ అల్లరితో కలర్ఫుల్ గా కనివిందు చేస్తూ, 1.5 మిలియన్ సబ్ స్క్రై బర్లను సంపాదించుకుంది. 199 దేశాలలోని తెలుగువారికి అందుబాటులో ఉంది. ఇక కొత్త సాఫ్ట్ వేర్ తో .. 2.0 వెర్షన్ తో ఈ యాప్ వీక్షకులను మరింతగా ఆకట్టుకోనుంది.
ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడం కోసమే 'ఆహా 2.0' ఈవెంట్ ను నిన్న రాత్రి గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ .. 'ఆహా' వేడుకకి వచ్చిన ప్రతి ఒక్కరికీ .. స్వాగతం .. సుస్వాగతం. నా ఆర్మీకి వెల్ కమ్. మా అందరి తరఫున మీకు .. మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. 'ఆహా' ఇంతదూరం వస్తుందని మేము అనుకోలేదు. ఈ రోజు వస్తుందని కూడా అసలు నేను ఊహించలేదు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత షార్టు టైమ్ లో ఇంతటి సక్సెస్ ఫుల్ యాప్ అయిందంటే, అందుకు కారణం తెలుగు ప్రేక్షకులు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు. మీరు లేకపోతే మేము లేము. ఫ్యాన్స్ లేకపోతే నేనే లేను. ఒక సక్సెస్ ఫుల్ నెంబర్ వన్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా 'ఆహా' ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్విస్త్తున్నాను. దీనికి ముఖ్య కారకులైనవారిని గురించి చెప్పాలి. మొదటగా మా నాన్నగారు .. అల్లు అరవింద్ గారు. తండ్రిని ఉద్దేశించి .. "డాడీ కంగ్రాచ్యులేషన్స్. ఫారిన్ ఓటీటీ ఛానల్స్ చూస్తూ ఎలాగైనా తెలుగులో ఒక ఓటీటీ ఛానల్ తీసుకురావాలని అనుకున్నారు. తెలుగువారికి కొత్త టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలని అనుకున్నారు.
దాదాపు 70 ఏళ్ల వయసు వచ్చి రిటైరైపోయి .. రిలాక్స్ కావలసిన టైమ్ లో నువ్వు ఇంత పెద్ద ప్రాజెక్టు టేకప్ చేసి .. 23 - 24 ఏళ్ల కుర్రాళ్లతో కలిసి పనిచేస్తూ .. 'ఆహా'కి ఇంత ఎనర్జీని ఇస్తున్న నీకు కంగ్రాట్స్ చెబుతున్నాను. ఏది చేసినా పెద్దగా .. ఎందులో ఉన్నా నెంబర్ వన్ గా .. దూసుకుపోతున్న రామేశ్వరరావు గారు ఒకసారి మమ్మల్ని కలిసి, "మేము ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వద్దామని అనుకుంటున్నాము .. ఏదైనా పెద్దగా చేద్దామని అనుకుంటున్నాము" అన్నారు. ఇలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది .. కాకపోతే అది చాలా కష్టమైన విషయం .. చాలా డబ్బుతో కూడిన వ్యవహారం అని చెప్పాము.
'మేము ఒకసారి అడుగుముందుకు వేస్తే .. తిరిగి వెనకడుగు వేయము ..' అని చెప్పడమే కాదు .. చేతల్లో చూపించిన రామేశ్వరరావుగారికి మేమంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రామ్ జూపల్లి కి కూడా సభా ముఖంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆయన కాంట్రి బ్యూషన్ లేకపోతే ఈ రోజున 'ఆహా' ఈ స్థాయిలో ఉండేది కాదు. ఈ సందర్బంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.