Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సార్ అవ‌కాశం ఇస్తేనే క‌దా..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 1:30 PM GMT
ఎన్టీఆర్ సార్ అవ‌కాశం ఇస్తేనే క‌దా..!
X
శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ కపూర్ ఇషాన్ ఖట్టర్ సరసన 'ధడక్‌'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలో న‌టించేప్పుడే జాన్వీ త్వ‌ర‌లోనే టాలీవుడ్ లో ప్ర‌వేశిస్తోంద‌ని కూడా గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ జాన్వీ టాలీవుడ్ ఆరంగేట్రంపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటీవ‌ల‌ జాన్వీ ఒక అగ్ర తెలుగు హీరో స‌ర‌స‌న తెరంగేట్రం చేస్తోంద‌ని పుకార్లు షికార్ చేసాయి. ఈ పుకార్ల‌లో రామ్ చ‌ర‌ణ్‌- అల్లు అర్జున్- ఎన్టీఆర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. కానీ అదేదీ ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు.

ఇటీవ‌ల ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కించనున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఎన్టీఆర్ 30లో జాన్వీ న‌టిస్తుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. జాన్వీని ఒప్పించేందుకు కొర‌టాల త‌న‌వంతు ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని కానీ షెడ్యూల్స్ కుద‌ర‌డం లేద‌ని కూడా అడ్వాన్స్ డ్ గా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

అయితే త‌న‌కు ఎన్టీఆర్ 30 నుంచి ఎలాంటి అవ‌కాశం రాలేద‌ని జాన్వీ ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ స‌ర‌స‌న అవ‌కాశం వ‌స్తే న‌టిస్తుందా? అంటే దానికి నో అని చెప్పే ఛాన్సే లేద‌ని కూడా క్లారిటీనిచ్చింది. ఇప్పుడు మ‌రోసారి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే విడిచిపెట్ట‌న‌ని జాన్వీ క‌పూర్ వ్యాఖ్యానించింది. "ఎన్టీఆర్ (జూనియర్ ఎన్టీఆర్) సార్ తో కలిసి పనిచేసే అవకాశం నాకు చాలా ఇష్టం. అత‌డు అంత గొప్ప‌ లెజెండ్. కానీ దురదృష్టవశాత్తూ ఆ ఆఫర్ నాకు ఇంకా రాలేదు" అని జాన్వీ ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించింది.

ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమా మిలీ ప్ర‌చారంలో బిజీగా ఉన్న జాన్వీ ఓ చాటింగ్ సెష‌న్ లో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టిస్తాన‌ని వ్యాఖ్యానించింది. రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ న‌టించిన ఆర్.ఆర్.ఆర్ చూశాన‌ని ఇద్ద‌రూ అద్భుత న‌టుల‌ని కొనియాడిన జాన్వీ త‌న‌కు ఆఫర్ వ‌స్తే ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని కూడా క‌న్ఫామ్ చేసింది. దీనిని బ‌ట్టి కొర‌టాల బృందం నుంచి జాన్వీకి ఆఫ‌ర్ వెళ్లిందా లేదా? అన్న‌దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. దీనిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంటుంది.

ఇటీవ‌ల వేరొక ఇంట‌ర్వ్యూలో సౌత్ ఫిల్మ్ మేకర్ మణిరత్నంతో కలిసి పని చేయాలనే కోరికను కూడా జాన్వీ వెలిబుచ్చింది. క్లాసిక్ ఫిలింమేక‌ర్ మణిరత్నం బ్రాండ్ సినిమా చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పింది.

మిలీ ప్ర‌మోష‌న్స్ లో బిజీ బిజీ

జాన్వీ తన త‌దుప‌రి చిత్రం మిలీ 2019లో విడుదలైన మలయాళ చిత్రం 'హెలెన్‌'కి అధికారిక రీమేక్. మత్తుకుట్టి జేవియర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల్లో భాగంగా జాన్వీ వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో సునామీగా మారుతున్నాయి. మిలీ చిత్రం సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కింది. అంద‌మైన మిలీ బ‌తుకు మనుగడ ప్రయాణం క్లిష్ఠ‌ ప‌రిస్థితుల్లో ఎలా సాగింది? అన్న‌ది పెద్ద తెర‌పై చూడాలి. ఆమె అనుకోని స‌న్నివేశంలో చిక్కుకుపోయి కోల్డ్ ఫ్రీజర్ నుండి కూడా తప్పించుకుంటుంది. ఇలాంటి ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చూడొచ్చు. టీజర్ లో జాన్వీ కపూర్ ఎలక్ట్రికల్ టేప్ ను కత్తిరించి దానితో చుట్టుకొని వణుకుతూ క‌నిపించింది. విపరీతమైన చలిని త‌ట్టుకోలేక‌ జాన్వీ భ‌యంతో జ్వ‌ర‌ లక్షణాలతో బాధ‌ప‌డ‌డం కూడా టీజర్ లో చూపించారు. చలిని ఎలాగైనా ఎదుర్కోవటానికి ఆమె తన చేతులను రుద్దడం.. ఎముక‌ల‌ను కొరికే చ‌లిలో పాదాలను బిగించడం ప్ర‌తిదీ ఎమోష‌న్ ని ర‌గిలిస్తుంది.

ఈ టీజర్ చూసిన తర్వాత ఇది మంచి సినిమా అవుతుందని అంచనా వేశారు నెటిజ‌నులు. మిలి నవంబర్ 4 న విడుద‌ల కానుంది. ఇందులో బోనీ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది. కుమార్తె జాన్వి తో క‌లిసి తండ్రి బోనీ కపూర్ ఒక నిర్మాణంలో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. జాన్వీతో కలిసి మనోజ్ పహ్వా - సన్నీ కౌశల్ ఈ సర్వైవల్ థ్రిల్లర్ లో నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.