Begin typing your search above and press return to search.
రాజమౌళిగారి సినిమా చేస్తే ఈ జన్మకి అంతే చాలు!
By: Tupaki Desk | 15 Feb 2022 7:07 AM GMTవెండితెరపై కథానాయికగా వెలిగిపోవడమనేది అంత తేలికైన విషయమేం కాదు. ఎంతోమంది పోటీని దాటుకుని అవకాశం రావాలి .. మరెంతో మంది పోటీని తట్టుకుని నిలబడాలి. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ .. నాయిక ఎవరైనా అందంగా ఉండాలనే ఆడియన్స్ కోరుకుంటారు. వాళ్లకి నచ్చేలా కనిపించడానికి ఒప్పుకునేది లేదంటూ షరతులు పెట్టే కథానాయికలను ఇక్కడ పక్కన పెట్టేస్తారు. స్కిన్ షో చేయకుండా ఇక్కడ నెగ్గుకు రావడం చాలా కష్టం. అలా నెగ్గుకొచ్చినవారిని వ్రేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఆ కొద్దిమందిలో ఆమని పేరు కూడా కనిపిస్తుంది.
తెలుగు ఇండస్ట్రీకి ఆమని పరిచయమైనప్పుడు ఇక్కడ రోజా - రంభ వంటి గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నారు. ఇక గ్లామర్ తో పాటు నటనలోను ఎంతమాత్రం తీసిపోని సౌందర్య కూడా బరిలోనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నటనను మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్లడం సాహసంతో కూడిన పనే. అయినా ఆ పోటీని తట్టుకుంటూ ఆమని ముందుకు వెళ్లారు. ఆమని కళ్లలోని ఆకర్షణ .. ఆమె నటనలో సహజత్వం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆమె బాగా చేరువైపోయారు. ముఖ్యంగా 'పచ్చని సంసారం' .. 'మిస్టర్ పెళ్ళాం' .. శుభలగ్నం' .. శుభసంకల్పం' .. 'మావి చిగురు' వంటి సినిమాలు ఆమెను నిలబెట్టేశాయి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీయాలనుకునే దర్శక నిర్మాతలకు అప్పట్లో ఆమని ఫస్టు ఛాయిస్ అయ్యారు. బాపు .. విశ్వనాథ్ వంటి దర్శకుల దృష్టిలో పడి .. వాళ్ల సినిమాల్లో అవకాశాలను పొందడం అప్పట్లో చాలా కష్టమైన విషయం. కానీ ఆమని ఆ ఇద్దరి దర్శకుల మెప్పును పొందడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. ఆ దర్శకుల నుంచి వచ్చిన సినిమాలు ఆమె కెరియర్లో మైలురాళ్లుగా కనిపిస్తాయి. అలాంటి ఆమని తన కెరియర్ మంచి జోరుమీద ఉండగానే పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత సినిమాలకి దూరమయ్యారు.
వివాహమైన కొంతకాలానికి ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ హీరోయిన్స్ కి ముఖ్యమైన పాత్రలను ఇచ్చే ట్రెండ్ రావడం ఆమెకి కలిసొచ్చింది. దాంతో కేరక్టర్ ఆర్టిస్టుగా ఆమె బిజీ అయ్యారు. ఈ మధ్య వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' .. 'శ్రీకారం' .. 'చావుకబురు చల్లగా' సినిమాలలో ఆమె వైవిధ్యభరితమైన పాత్రలను చేశారు. ఇక ఇప్పుడు ఆమని మేనకోడలు హ్రితిక కూడా 'అల్లంత దూరాన' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమని కూడా పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కెరియర్ ను గురించి కూడా ప్రస్తావించారు.
"ఇంతకాలం పాటు నేను ఇండస్ట్రీలో ఉంటానని .. ఇన్ని సినిమాలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతోమంది దర్శక నిర్మాతలు నాకు అనేక రకాలైన పాత్రలనిస్తూ ప్రోత్సహించారు. అందుకు వాళ్లందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఇన్నేళ్ల నా కెరియర్లో చాలా డిఫరెంట్ రోల్స్ చేశాను. కానీ ఒక నటిగా నేను ఇంకా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు.
ఇంతవరకూ చాలామంది దర్శకులతో కలిసి పనిచేశాను. కానీ రాజమౌళి గారి సినిమాలో చేయాలనే కోరిక అలా ఉండిపోయింది. ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా చేయాలనుంది. ఆయన సినిమాలో చేసే ఛాన్స్ వస్తే ఈ జన్మకి అంతేచాలు" అని చెప్పుకొచ్చారు.