Begin typing your search above and press return to search.
సామ్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ రావాలంటే..?
By: Tupaki Desk | 18 Oct 2022 11:30 PM GMTదక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్లాన్స్ వేస్తోంది. ఇప్పటికే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో సామ్ నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. అలానే 'పుష్ప' సినిమా విజయం సాధించడంతో.. ఊ అంటావా మావా అంటూ ఐటమ్ సాంగ్ తో ఉత్తరాదిని ఊపేసింది.
ఈ నేపథ్యంలో సమంతను హిందీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేరుగా హిందీ సినిమా చేయకపోయినా.. ఆమెకు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉంది. కాకపోతే దాన్ని కాపాడుకోడానికి సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
సామ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమైంది. ఇప్పటికే 'యశోద' & 'శాకుంతలం' వంటి రెండు పాన్ ఇండియా సినిమాల షూటింగ్స్ పూర్తి చేసింది. ఇందులో 'యశోద' మూవీ రిలీజ్ కు రెడీ అయింది. 2022 నవంబర్ 11న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
'యశోద' అనేది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్. ఇందులో సమంత ఒక గర్భిణీ స్త్రీ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - గ్లింప్స్ మరియు టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. శ్రీదేవి మూవీస్ పతాకంపై దర్శక ద్వయం హరి & హరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. 'యశోద' తో పాన్ ఇండియా స్థాయిలో సామ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని అందరూ నిశితంగా గమనిస్తారు. అందుకే ఈ సినిమా సక్సెస్ ఆమెకు కీలకమని చెప్పాలి.
సమంతకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ.. అన్ని భాషల్లో విజయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా ఆమె స్టార్ డమ్ కి పెద్ద పరీక్ష అని చెప్పాలి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అందరిని మెప్పించగలిగితేనే.. 'శాకుంతలం' సినిమాకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాదు వచ్చే ఏడాది స్ట్రెయిట్ బాలీవుడ్ ఎంట్రీ సాఫీగా సాగుతుంది.
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను హోమ్ ప్రొడక్షన్ లో సమంత ఓ హిందీ ప్రాజెక్ట్ కమిట్ అయిందని స్పష్టత వచ్చేసింది. ఇదే క్రమంలో ఆయుష్మాన్ ఖురాన్ - అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అలానే రాజ్ & డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనుంది.
ఇక సౌత్ లో విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' అనే రొమాంటిక్ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లోనూ రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు టాక్. వీటన్నింటిని కంటే ముందుగా ఆమె పేరు మీదుగానే మార్కెట్ చేయబడుతున్న 'యశోద' సినిమా హిట్ అవ్వాల్సి అవసరం ఉంది. మరి ఈ సినిమా అన్ని భాషల్లోనూ విజయం సాధించి సామ్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.