Begin typing your search above and press return to search.
సామ్ మొహమాటంతో నో చెప్తే.. కాజల్ కి ఛాన్స్
By: Tupaki Desk | 17 April 2022 4:30 AM GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అతి త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ తో ఉన్న ఫోటోలు మరియు వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రెగ్నెంట్ అవ్వక ముందు సినిమాలు మరియు ఇతర కార్యక్రమాలతో భారీగానే ఆదాయం దక్కించుకున్న కాజల్ ఇప్పుడు ఆదాయం విషయంలో నష్టపోక తప్పదని భావించారు.
ఇతర హీరోయిన్స్ మాదిరిగా ప్రెగ్నెంట్ సమయంలో నష్టపోకుండా కాజల్ చాలా ప్లాన్ చేసుకుంది. ఆమె సినిమాల్లో నటించినప్పుడు ఏ స్థాయిలో ఆదాయం దక్కించుకుందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆదాయం ను సోషల్ మీడియా ద్వారా దక్కించుకుంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా సందడి చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి జోరుకు ఇతర స్టార్స్ కూడా బేజారు అవుతున్నారు. తాజాగా ఈమె ప్రెగ న్యూస్ అనే బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. మొదట ఈ ఆఫర్ సమంత వద్దకు వెళ్లిందనే వార్తలు వచ్చాయి.
ఇటీవలే చైతూ నుండి విడాకులు తీసుకున్న సమంత ఈ సమయంలో ప్రెగ్నెన్సీ టెక్ట్ కు సంబంధించిన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సామ్ మొహమాటంతో ఆ బ్రాండ్ కు నో చెప్పిందనే సమాచారం అందుతోంది.
పెళ్లి అయిన హీరోయిన్ లేదా తల్లి అయిన హీరోయిన్ లు ఇది చేస్తే బాగుంటుందని ఆమె భావించింది. అందుకే కాజల్ అగర్వాల్ వద్దకు ఈ బ్రాండ్ వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది.
సమంత మొహమాటం లేకుండా ఈ బ్రాండ్ కు అంబాసిడర్ గా చేసి ఉంటే భారీ పారితోషికం అయితే వచ్చేది కాని ఆమెను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో జనాలు విమర్శించే వారు. ఆమె ఈ విషయం లో తీసుకున్న నిర్ణయం మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.