Begin typing your search above and press return to search.
ఆ రెండు సాయి పల్లవి చేస్తే రూ.50 కోట్లు సంపాదించేది
By: Tupaki Desk | 25 May 2022 3:30 PM GMTఫిదాతో టాలీవుడో ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తెలుగు తో పాటు తమిళం.. మలయాళం మరియు హిందీలో కూడా గుర్తింపు ఉన్న హీరోయిన్. ఆమె నటనతో పాటు అందంతో కూడా అభిమానులను సొంతం చేసుకుంది. చాలా మంది హీరోయిన్స్ స్కిన్ షో చేసి అందంగా కనిపించి ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఆధరణ దక్కించుకుటారు. కాని సాయి పల్లవి అలా కాదు.
స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉంటుంది. అయినా కూడా ఆమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కింది. దాంతో ఒక్కో సినిమాకు రెండున్నర నుండి నాలుగు కోట్ల వరకు ఆఫర్లు వస్తున్నాయి. అయినా కూడా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయకుండా కోట్లకు ఆశపడకుండా సాయి పల్లవి కేవలం తనకు నచ్చినవి.. తనను ప్రేక్షకులు ఎలా అయితే నచ్చుతారో అలాంటి పాత్రలను మాత్రమే చేస్తూ వస్తుంది.
తాజాగా ఒక మీడియా చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్ లపై సాయి పల్లవి స్పందిస్తూ తనకు ఆ డ్రస్ లు.. ఆ డాన్స్ స్టెప్పులు అస్సలు సెట్ అవ్వవు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక తన వద్దకు ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రమోషన్ చేయమంటూ వచ్చారని.. కాని తాను మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
సాయి పల్లవి ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఒకటి రెండు ఐటెం సాంగ్స్ చేస్తూ చేతిలో నాలుగు అయిదు బ్రాండ్స్ ను పట్టుకుని ఉంటే భారీ ఆదాయం వస్తుంది. పదుల కోట్ల ఆదాయం సెలబ్రెటీలకు అది కాకుండా స్టార్స్ కు రావడం అనేది ఈమద్య కాలంలో చాలా సాధారణ విషయం అయ్యింది. సాయి పల్లవి కూడా అలా డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఇతరుల కంటే ఎక్కువే వచ్చేవి.
హీరోయిన్ గా కాకుండా ఐటెం సాంగ్ మరియు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించే పనులు రెండు చేసి ఉంటే ఖచ్చితంగా ఏడాదికి సాయి పల్లవి రూ.50 కోట్ల వరకు సంపాదించేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చినా కూడా డబ్బు విషయంలో సాయి పల్లవికి ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుగా కాని.. డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్దం అన్నట్లుగా కాని ఉండదు.
ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే విరాటపర్వం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విరాట పర్వం తర్వాత సాయి పల్లవి కొత్త సినిమా మొదలు పెట్టడం లేదేమో అనుకుంటూ ఉండగా ఒక బహుభాష పాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. సాయి పల్లవి కమర్షియల్ పాత్రలు చేయాలని.. రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.