Begin typing your search above and press return to search.

థమన్‌ లేకుంటే 'మజిలీ' వాయిదా పడేదా?

By:  Tupaki Desk   |   3 April 2019 12:13 PM GMT
థమన్‌ లేకుంటే మజిలీ వాయిదా పడేదా?
X
మరో రెండు రోజుల్లో అక్కినేని ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న 'మజిలీ' చిత్రం విడుదల కాబోతుంది. ఏప్రిల్‌ 5న విడుదల కాబోతున్న 'మజిలీ' చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక ఇటీవలే జరిగింది. నాగచైతన్య మరియు సమంత పెళ్లి తర్వాత నటించిన మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన గత చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్న కారణంగా కూడా ఈ చిత్రంకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. 'నిన్ను కోరి' చిత్రంతో ఒక మంచి సినిమాను తీసిన శివ నిర్వాన ఈ చిత్రంను తెరకెక్కించాడు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన సమయంలో సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ కు మరియు శివ నిర్వానకు మద్య విభేదాలు తలెత్తాయి అంటూ ప్రచారం జరిగింది.

'మజిలీ' చిత్రంకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ థమన్‌ అందించిన నేపథ్యంలో ఇద్దరి మద్య గొడవలు నిజమే అని తేలిపోయింది. 'మజిలీ' షూటింగ్‌ పూర్తి చేసి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో గోపీ సుందర్‌ తనకు కాస్త టైం కావాలంటూ కోరడంతో దర్శకుడు షాక్‌ అయ్యాడట. ఆ సమయంలో సినిమా వాయిదా వేయమని కూడా గోపీ సుందర్‌ సలహా ఇచ్చాడట. అయితే కేవలం బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కోసం సినిమాను వాయిదా వేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదనే ఉద్దేశ్యంతో థమన్‌ ను కోరగా ఆయన మంచి మనసుతో సినిమాకు నేపథ్య సంగీతం అందించాడట.

గోపీ సుందర్‌ తో గొడవలు ఉన్నా కూడా దర్శకుడు శివ నిర్వాన ఆ విషయాన్ని బయటకు కనిపించకుండా ప్రీ రిలీజ్‌ వేడుకలో పాటలు మరియు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్రాణంగా నిలుస్తాయని, గోపీసుందర్‌ మరియు థమన్‌ గారు సినిమా స్థాయిని పెంచారు అంటూ శివ చెప్పుకొచ్చాడు. థమన్‌ ముందుకు రాకుంటే 'మజిలీ' చిత్రం ఈ నెల చివరికి వెళ్లి పోయేది. మంచి సమయంలో విడుదల అయ్యేందుకు థమన్‌ సాయం చేయడం జరిగింది. ప్రస్తుతం పోటీ లేకపోవడంతో పాటు, పరీక్షలు పూర్తి అయిన టైం అవ్వడంతో సినిమాకు మంచి కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది.