Begin typing your search above and press return to search.

ఆ హీరో కమిట్ మెంట్ అడిగితే.. మీ అమ్మాయిని కూడా పంపుతావా? అని అడిగిందట

By:  Tupaki Desk   |   8 July 2021 4:43 AM GMT
ఆ హీరో కమిట్ మెంట్ అడిగితే.. మీ అమ్మాయిని కూడా పంపుతావా? అని అడిగిందట
X
హీరోయిన్ గా అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ఒక ఎత్తు అయితే.. స్టార్ డమ్ సొంతం చేసుకోవటం మరో ఎత్తు. అందం.. టాలెంట్ ఉంటే సరిపోదు. కాలం కలిసి వచ్చేలా సినిమాల్లో అవకాశాలు దక్కాలి. నిజానికి ఇదే చాలామంది హీరోయిన్లలో మిస్ అవుతుంటారు. తన తొలి సినిమాతోనే సంచలనంగా మారటమే కాదు.. తాను కొందరు హీరోలతో మాత్రమే నటిస్తానని ఓపెన్ గా చెప్పి మరీ అగ్రస్థానంలో నిలిచిన హీరోయిన్ గా ఆమె రికార్డుల్ని మరెవరూ బద్దలు కొట్టలేరేమో? ఇంతకీ ఇదంతా ఎవరి గురించో తెలుసు కదా? సీనియర్ నటి ఖుష్బూ. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలతో పాటు.. సంచలన ఉదంతాల్ని చెప్పి షాకిచ్చారు.

చాలామంది సినీ నటీమణులకు ఎదురైనట్లే తనకు వేధింపులు తప్పలేదని స్పష్టం చేశారు. తాను కూడా మీటూ బాధితురాలినేనని చెప్పిన ఆమె.. మిగిలిన వారి కంటే భిన్నంగా తన అనుభవాల్ని ఓపెన్ గా చెప్పేశారు. అంతేకాదు.. తనను కమిట్ మెంట్ అడిగిన అగ్రహీరో పేరును అంచనా వేసుకునే అవకాశాన్ని కల్పించటం మరో విశేషంగా చెప్పాలి. 1986 లో వెంకటేశ్ ను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన కలియుగ పాండవుల సినిమాలో ఖుష్బూ తళుక్కున మెరిశారు. ఆ మూవీ ఆమెకు సైతం తొలి సినిమానే. తెలుగులో సూపర్ హిట్ నటిగా పేరును సొంతం చేసుకున్న ఆమె.. తమిళనాడులో కూడా తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకున్నారు.

ఒక దశలో తమిళ ప్రేక్షకులు ఆమె మీద పొంగిపొర్లే అభిమానంతో ఏకంగా గుడి కట్టి పూజించటం సంచలనంగా మారింది. అంతటి ఇమేజ్ ఉన్న ఆమెకు వేధింపులు తప్పలేదు. తన తొలి సినిమా సమయంలోనే తాను వేధింపులకు గురైనట్లు చెప్పారు. ఒక చిన్న గ్రామంలో షూట్ జరుగుతున్న సమయంలో సాయంత్రం వేళలో షూట్ ముగిసిన వేళలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘‘నేను మెట్లు ఎక్కుతున్నాను. నన్ను వెనుక నుంచి అసభ్యంగా తాకేశాడు. అతడు ఎవరన్నది నేను చూసుకోలేదు. కోపం కట్టలు తెగింది. దీంతో.. చెంప ఛెళ్లుమనిపించాను. ఈ సంఘటన జరిగిన సమయంలో సురేశ్ బాబు అక్కడే ఉన్నారు. ఆయనతో పాటు అక్కడ ఉన్న చాలామంది నన్ను సమర్థించారు’’ అని పేర్కొన్నారు.

అంతేకాదు.. టాలీవుడ్ కు చెందిన ఒక హీరో తనను కమిట్ మెంట్ అడిగాడని.. అందుకు తాను ఘాటుగా రియాక్టు అయినట్లుగా పేర్కొంది. ఒక హీరో తనను కమిట్ మెంట్ అడిగితే.. అందుకు ప్రతిగా.. ‘మీ అమ్మాయిని పంపితే నేను కూడా ఒప్పుకుంటా’ అని రివర్సు కౌంటర్ ఇవ్వటంతో షాక్ తిన్నాడని.. ఆ తర్వాత మళ్లీ మాట్లాడలేదని పేర్కొంది. కుమార్తె ఉన్న హీరో అన్న హింట్ ఇచ్చారే కానీ.. సదరు హీరో ఎవరన్న విషయాన్ని మాత్రం ఖుష్బూ వెల్లడించలేదు. మొత్తానికి.. అగ్గి బరాటా అన్నంత రేంజ్ లో ఖుష్బూ తీరు ఉంటుందని చెప్పక తప్పదు.