Begin typing your search above and press return to search.

పెళ్లైతే చేసుకున్నా కానీ.. ప్రెగ్రెంట్ ఎలా అవుతా చెప్పండి?

By:  Tupaki Desk   |   10 Nov 2022 11:30 PM GMT
పెళ్లైతే చేసుకున్నా కానీ.. ప్రెగ్రెంట్ ఎలా అవుతా చెప్పండి?
X
నలుగురితో నడవని బ్యాచ్ ఒకటి ఉంటుంది. అందునా.. కోట్లాది మంది నడిచే దారికి భిన్నంగా వ్యవహరించే వారు కొందరుంటారు. కానీ.. సెలబ్రిటీల్లో అలాంటి వారు తక్కువే. ఆ కొరత తీరుస్తారు టీవీ నటి కనిష్క సోని. అందానికి అందం.. అంతకు మించిన ఆకర్షణతో మెరిసే ఆమె.. ఊహించని రీతిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడున్న కాలంలో అమ్మాయి.. అబ్బాయి పెళ్లిళ్లు చేసుకోవటం పాతదై.. అమ్మాయిని అమ్మాయి పెళ్లాడటం తెలిసిందే.

కానీ.. కనిష్క సోని మరో ముందుకు వేసి.. తనను తానే పెళ్లి చేసుకున్నారు. 'సోలోగమి' అనే ఈ విధానంలో తమను తామే పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి తంతుకు తెర తీసి అందరూ తన వైపు చూసేలా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అయి పాపులర్ అయ్యారు. తాజాగా కనిష్క ప్రెగ్నెంట్ అన్న ప్రచారం సాగుతోంది. దీంతో.. ఈ విషయం కనిష్క వరకు వెళ్లింది.

దీనికి ఆమె ఆశ్చర్యానికి గురైంది. వెంటనే క్లారిటీ ఇచ్చేసింది. తనను తాను పెళ్లి చేసుకున్నంత మాత్రా.. తనకు తాను గర్భం దాల్చే అవకాశం లేదు కదా? అంటూ సూటి క్వశ్చన్ వేసింది. తాను ఇటీవల కాలంలో రుచికరమైన బర్గర్లు.. పిజ్జాలు ఇలా ఎన్నో తిన్నానని.. అందుకే కాస్తంత లావయ్యానే తప్పించి.. ప్రెగ్నెంట్ కాదంటూ తన రీసెంట్ ఫోటోల్ని షేర్ చేసింది. తనను తాను పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండదు కదా? అదీ పాయింటే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.