Begin typing your search above and press return to search.
100 కోట్ల క్లబ్ లో చేరితే ఆ మాత్రం ఉండాల్సిందే!
By: Tupaki Desk | 21 Sep 2022 5:50 AM GMTయంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గత కొంత కాలంగా సెలెక్టెడ్ గా కథలని ఎంచుకుంటూ వరుస హిట్ లని దక్కించుకుంటున్నాడు. హీరో మంచి పేరు తెచ్చుకుంటూనే తన మార్కెట్ ని కూడా క్రమ క్రమంగా పెంచుకుంటూ వెళుతున్నాడు. నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'కార్తికేయ2'. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు దఫాలుగా రిలీజ్ వాయిదా పడి ఫైనల్ గా ఆగస్టు 13న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
దక్షిణాదితో పాటు ఈ మూవీ హిందీ బెల్ట్ లోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నిఖిల్ కెరీర్ లోనే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. ఓ సాధారణ సినిమాగా విడుదలై ఉత్తరాదిలో అత్యధిక థియేటర్లకు విస్తరించి రూ. 30 కోట్లకు పైగా రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి నిఖిల్ ని తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేర్చింది. ఈ మూవీకి ముందు నిఖిల్ సినిమా మార్కెట్ రూ. 25 కోట్లే.
కానీ 'కార్తికేయ 2' ఆ స్థాయిని అధిగమించి రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఆశ్చర్యపరిచింది. దీంతో హీరోగా నిఖిల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. అంతే కాకుండా ఈ మూవీ తనని పాన్ ఇండియా స్థార్ ల జాబితాలో చేర్చింది. దీంతో గత కొంత కాలంగా తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు మించి ఇకపై అంగీకరించే మూవీస్ కి పారితోషికాన్ని తీసుకోవాలని నిఖిల్ నిర్ణయించుకున్నాడట.
అంతే కాకుండా ఇకపై తన ప్రతీ సినిమా భారీ స్పాన్ తో వుండాలని, అలాంటి కథలతో తన వద్దకు రమ్మని ప్రొడ్యూసర్స్ కి నిఖిల్ చెబుతున్నాడట. ఇదిలా వుంటే 'కార్తికేయ 2' రిలీజ్ కు ముందు నిఖిల్ 'స్పై' పేరుతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీని కూడా 'కార్తికేయ 2' తరహాలో ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నారు.
'కార్తికేయ 2' పాన్ ఇండియా సక్సెస్ తో మారిన సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని నిఖిల్ ఇకపై తన ప్రతీ సినిమా రూ. 30 కోట్ల బడ్జెట్ కు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. మినిమమ్ గ్యారెంటీ రిటర్న్స్ హీరోగా మంచి గుర్తింపుని మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న నిఖిల్ ఇకపై అదే పంథాని కొనసాగిస్తూ భారీ సినిమాల్లో మాత్రమే నటించాలని ప్లాన్ చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిఖిల్ ప్లాన్ ని గమనించిన ఇండస్ట్రీ వర్గాలు 100 కోట్ల క్లబ్ లో చేరితే ఆ మాత్రం ఉండాల్సిందే అని అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.