Begin typing your search above and press return to search.
మహేష్ తో ఛాన్స్ కావాలంటే ముందు ఆ పని చేయాలి!
By: Tupaki Desk | 28 March 2021 5:30 PM GMTఒక అగ్ర హీరోతో కొత్త దర్శకుడు సినిమా చేయాలంటే అంత సులువేమీ కాదు. తొలుత మంచి కథకుడు అనిపించాలి. ఆ తర్వాత ఎవరైనా చిన్న హీరోతో హిట్టు కొట్టి నిరూపించుకోవాలి. ఆ తర్వాత బౌండ్ స్క్రిప్ట్ తో పెద్ద హీరోని మెప్పించాలి. అంత చేసినా టెక్నికాలిటీస్ .. బ్యాక్ గ్రౌండ్ వగైరా పరిశీలనకు వస్తాయి. బ్రైట్.. బ్రిలియంట్.. క్లెవర్ .. నో కన్నింగ్ అని ప్రూవ్ అయితేనే ఆఫర్ ఉంటుంది. ఏదో గాలివాటంగా లక్కు చిక్కి దర్శకులు అయిపోవడం చాలా కష్టం.
అందుకే ఫిలింనగర్ కృష్ణానగర్ లో ఎంతోమంది ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ ఈ కరోనా కాలంలోనూ వెయిటింగ్. అదంతా సరే కానీ.. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాక కూడా వెంకీ కుడుములకు మహేష్ ఆఫర్ ఇవ్వకపోవడమే ఆశ్చర్యపరుస్తోంది. తొలిగా తన బ్యానర్ లో వేరొక హీరోతో హిట్టు కొట్టి నిరూపించాలని మహేష్ కండీషన్ పెట్టారట. దీంతో వెంకీ కుడుముల కల వెంటనే నెరవేరడం కుదరలేదు.
నిజానికి వెంకీ చాలా కాలంగా మహేష్ తో సినిమా చేయాలని కష్టపడుతున్నాడు. ఛలో- భీష్మ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టాడు. పైగా మహేష్ అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ శిష్యుడిగానూ వెంకీ కుడుములపై మహేష్ కి సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ అతడు తొలిగా తన బ్యానర్ లో వేరొక యువహీరోతో సినిమా చేయాలని కోరారు. అలా నవీన్ పోలిశెట్టితో ప్రాజెక్టును సెట్ చేస్తున్నారట.
నిజానికి వరుస బ్లాక్ బస్టర్లు కొట్టిన వెంకీ కుడుముల కావాలనుకుంటే స్టార్ హీరోలు లేదా ఇప్పటికే పాపులరైన హీరోలతో ఛాన్సులుంటాయి. కానీ మహేష్ ఆఫర్ ని తిరస్కరించకుండా సైలెంట్ గా సినిమా చేస్తున్నాడట. నవీన్ పోలిశెట్టి నటించిన రెండు సినిమాలతో నిరూపించుకున్నాడు కాబట్టి హీరో విషయంలో మరో ఆలోచన చేయలేదట.
ఇటీవల మహర్షి లాంటి జాతీయ అవార్డు సినిమా తీసిన వంశీ పైడిపల్లికే మహేష్ తో ఛాన్స్ రాలేదు. స్క్రిప్టుతో వందశాతం మెప్పిస్తేనే ఆఫర్ అని చెప్పేశారు. అంతకుముందు పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ని బిజినెస్ మేన్ లాంటి కమర్షియల్ హిట్ ని ఇచ్చిన పూరీకే మహేష్ అవకాశం ఇవ్వలేదు. అలాంటిది రెండు సినిమాల కిడ్ కి డైరెక్ట్ గా అవకాశం ఇచ్చేస్తారా? అంటూ గుసగుసలాడేస్తున్నారు. ఎంబీ ప్రొడక్షన్స్ లో మేజర్ (అడివిశేష్) తర్వాత నవీన్ పోలిశెట్టి- వెంకీ కుడుముల కాంబినేషన్ సినిమా ఉంటుంది. ఈ సినిమాతో నిరూపించుకుని స్క్రిప్టు పరంగా మెప్పిస్తే అప్పుడు మహేష్ తో సినిమా ఉంటుందన్నమాట. వెంకీకి ఇది నిజంగానే బిగ్ టెస్ట్.