Begin typing your search above and press return to search.
శ్రీదేవి వైరల్ వీడియోపై రచ్చ!
By: Tupaki Desk | 4 Aug 2018 4:24 PM GMTఅతిలోక సుందరి - అందాల తార శ్రీదేవి మరణంపై ఏర్పడిన అనుమానాలు నివృత్తి కాకుండానే ఆ వ్యవహారం అటకెక్కిన సంగతి తెలిసిందే. శ్రీదేవిది సహజ మరణం కాదంటూ....ముంబైకి చెందిన ఓ రిటైర్డు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ అధికారి చేసిన ఆరోపణలు కూడా మరుగునపడ్డాయి. అయితే, తాజాగా శ్రీదేవి పేరు మరో వివాదంలో చిక్కుకుంది. శ్రీదేవికి సంబంధించిన అరుదైన ఫొటోలతో ఓ అభిమాని రూపొందించిన వీడియోపై వివాదం రేగింది. ఆ వీడియోను తన అనుమతి లేకుండా ‘ఐఫా’ నిర్వాహకులు వాడుకున్నారని సబా ఆరిఫ్ అనే అభిమాని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అయితే, ఆ వీడియోను వాడుకునేందుకు తానే అనుమతినిచ్చానని తాజాగా బోనీ కపూర్ ప్రకటించారు. తన అనుమతి లేకుండా శ్రీదేవి ఫొటోలు తీసుకోవడమే కాకుండా....తిరిగి `ఐఫా`ను ప్రశ్నించడమేమిటని బోనీ అన్నారు.
శ్రీదేవి అపురూపమైన ఫొటోలతో సబా రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, ఆ వీడియోను యథాతధంగా ఐఫా నిర్వాహకులు ప్రదర్శించారు. అయితే, తన అనుమతి లేకుండా ఆ వీడియోను ఐఫా నిర్వాహకుల ఎలా వాడతారంటూ సబా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టింది. దీంతో, ఆ పోస్టుపై బోనీ కపూర్ స్పందించాడు. ఆ వీడియో విషయంలో ఏమైనా ఇబ్బంది కలిగితే తనతో మాట్లాడాలని, సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని అన్నాడు. సబా వాడిన ఫొటోలపై హక్కులు తనవని, అవి వాడుకొని వీడియో రూపొందించింది గాక తన వీడియోను వాడారని ఆరోపించడమేంటని బోనీ ప్రశ్నించాడు. ఆ వీడియో ప్రదర్శనకు తానే అనుమతిచ్చినట్లు బోనీ తెలిపాడు. అయితే, వీడియోలో ఫొటోలన్నీ బోనీ వేనని - కానీ దానిని రూపొందించడానికి 3 రోజులు తాను కష్టపడ్డానని చెప్పింది. అయితే, తన అనుమతి తీసుకోకపోగా కనీసం తనకు క్రెడిట్ ఇవ్వకుండా ఆ వీడియోను ఎలా వాడతారని సబా ప్రశ్నించింది.