Begin typing your search above and press return to search.
యంగ్ టాలెంట్స్ పై ఇళయరాజా సెటైర్స్
By: Tupaki Desk | 28 May 2019 5:35 AM GMTసౌత్ లోనే కాదు యావత్ భారతదేశ సినిమా సంగీత చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలు రాసుకున్న మాస్ట్రో ఇళయరాజా గత కొన్నేళ్లుగా తన పాత పాటల రాయల్టీ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఎస్పి బాలసుబ్రమణ్యంతో విభేదాలు మూడేళ్ళ పాటు సాగాయి. వాటికి చెక్ పెడుతూ ఇటీవలే మళ్ళి ఒక్కటవ్వడం సోషల్ మీడియాలో ఆ పిక్స్ వైరల్ కావడం అందరూ చూసి ఆనందించారు.
ఇదిలా ఉండగా నవతరం సంగీత దర్శకుల మీద రాజా కొన్ని ఘాటు కామెంట్స్ చేశారు. ఇప్పటి వాళ్ళలో టాలెంట్ లేదని తన పాత పాటలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్లను వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప స్వంతంగా ఏదైనా ఆలోచించాలన్న ధ్యాస లేకుండా పోయిందని విమర్శించారు. అంతే కాదు గత ఏడాది విడుదలై కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 96లో తన పాటలను హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను పుట్టించే సందర్భంలో వాడుకోవడం పట్ల కూడా ఇదే రీతిలో స్పందించారు. ఇదంతా ఓ ఇంగ్లీష్ మీడియా యుట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా వెల్లడించారు
టాలెంట్ లేనప్పుడే అవసరం ఉన్నా లేకపోయినా తన పాత సంగీతాన్ని వాడుకుంటారని అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారని రాజా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 96 మేకర్స్ అనుమతులు తీసుకుని వాడుకున్నప్పటికీ ఇప్పుడు రాజా ఇలా అనడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 96 ఇప్పుడు తెలుగులో కూడా అదే దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ తో రీమేక్ అవుతోంది. ఇక్కడ కూడా అదే తరహాలో రాజా పాటలనే వాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడీ రాజా అన్నవాటి గురించి వాళ్ళేమైనా స్పందిస్తారేమో చూడాలి