Begin typing your search above and press return to search.
రాజాతో AR రెహమాన్ దుబాయ్ స్టూడియోలో
By: Tupaki Desk | 7 March 2022 3:30 PM GMTమొజార్ట్ ఆఫ్ మద్రాస్ గా గొప్ప గౌరవాన్ని అందుకున్నారు స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్. ఇసైజ్ఞాని (సంగీత జ్ఞాని)గా ఇళయరాజాని పిలుస్తారు. ఎం.ఎస్ విశ్వనాథన్- టి.కె రంగమూర్తి వంటి ప్రముఖులకు ఈ తరహా బిరుదులు ఉన్నాయి. సౌత్ నుంచి ఆస్కార్ అందుకున్న మేటి సంగీత దర్శకుడిగా రెహమాన్ కి ఉండే గుర్తింపు గౌరవం ఎంతో ప్రత్యేకమైనవి.
ఏఆర్ రెహమాన్ ని ఇసైజ్ఞాని ఇళయరాజా నిన్న దుబాయ్ లో కలుసుకున్నారు. ఈ ఇరువురు చాలా మంది సంగీత స్వరకర్తలకు హాట్ ఫేవరెట్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరి కలయిక దేనికి? అంటే.. మాస్ట్రో రెహమాన్ యాజమాన్యంలోని ఫిర్దౌస్ స్టూడియోని రాజా ఇప్పటికి సందర్శించాలని భావించి కలిసారని సమాచారం.
ఎఆర్ రెహమాన్ ట్విట్టర్ లో లెజెండ్ ఇళయరాజాతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. అతను ఇలా వ్యాఖ్యను జోడించారు ``మా ఫిర్దౌస్ స్టూడియోకి మాస్ట్రో ఇళయరాజాను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది… భవిష్యత్తులో మా ఫిర్దౌస్ ఆర్చ్ ఆటాడేందుకు సంగీత జ్ఞాని అద్భుతమైన బాణీని కంపోజ్ చేస్తారని ఆశిస్తున్నాను!`` అని అభిమానం ప్రేమను కురిపించారు.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. త్వరలో ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతిభావంతులైన స్వరకర్తలు ఇద్దరూ దుబాయ్ ఎక్స్ పో 2022లో కలవడం ప్రత్యక్ష ప్రసారం లో ఇంతకుముందు కనిపించింది. అలాంటి అరుదైన లెజెండరీస్ కలయిక అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనది.