Begin typing your search above and press return to search.

76 వ‌చ్చినా రాజాలో అదే రాజ‌సం!!

By:  Tupaki Desk   |   2 Jun 2019 2:07 PM GMT
76 వ‌చ్చినా రాజాలో అదే రాజ‌సం!!
X
స్వ‌ర జ్ఞాని.. ఇసై జ్ఞాని ఎలా పిలిచినా ఇళ‌య‌రాజాకి మాత్ర‌మే ఆ పిలుపు అందుకునే అర్హ‌త ఉంది. స్వ‌ర‌రాజుగా పాట‌ల పూదోట‌లో విహ‌రించిన ఆయ‌న ద‌శాబ్ధాల పాటు త‌న స్థాయిని నిల‌బెట్టుకున్నారు. ప‌లు భాష‌ల్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతం అందించారు. ఇప్ప‌టికీ ఇళ‌య‌రాజా తెలుగు క్లాసిక్స్ కి యువ‌త‌రంలో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది.

తెలుగు- తమిళం- మలయాళం- హిందీ- కన్నడ- మరాఠీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో దాదాపు 5000కు పైగా పాటలకు సంగీతం అందించారు. ఎక్కువగా తమిళ సినిమాలు చేశారు. ఆయన సంగీతం అంటే చెవికోసుకునేంత క్రేజు. అందుకే ఎన్నో క్లాసిక్ హిట్స్ కెరియ‌ర్ లో ఉన్నాయి. ఇక రాజా రీరికార్డింగ్ ట్యాలెంట్ వేరొక సంగీత ద‌ర్శ‌కుడిలో చూడ‌లేం. తెలుగులో సాగర సంగమం- సీతకోక చిలుక- రుద్రవీణ- అభినందన- ఘర్షణ వంటి క్లాసిక్స్ కి సంగీతం అందించారు. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బాపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ శ్రీరామరాజ్యం చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే.

వీట‌న్నిటినీ మించి 76 వ‌య‌సులోనూ ఇళ‌య‌రాజా హెల్దీ లైఫ్ స‌ర్ ప్రైజింగ్ అనే చెప్పాలి. సుస్వ‌ర సామ్రాజ్య‌పు రారాజుగా.. సంగీత సాధ‌న‌తో అత‌డి వ‌య‌సును త‌గ్గించిందా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. నేడు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా విశ్వ‌న‌టుడు క‌మల్ హాస‌న్ ప్ర‌త్యేకంగా ఆయ‌న స్వ‌గ్ర‌హానికి వెళ్లి క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఇళ‌య‌రాజా వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో హ్యాపి బ‌ర్త్ డే అంటూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రాజా గురించిన ఓ సంగ‌తి ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. గానగాంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో క‌లిసి ఇళ‌య‌రాజా ఓ సినిమాకి ప‌ని చేస్తున్నార‌న్న‌దే ఆ వార్త‌. ఇటీవ‌ల బాలుతో ఇళ‌య‌రాజాకు మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో తిరిగి స్నేహం చిగురించ‌డంపైనా ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. అంటే గోల్డెన్ డేస్ లో గురుశిష్యుల మ‌ధ్య స్నేహం తిరిగి కొత్త చిగురు తొడిగింద‌ని అభిమానులు సంతోషిస్తున్నారు. 76వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (జూన్ 2న) చెన్నైలో ఇళయరాజా స్వయంగా నిర్వహించే లైవ్ షోలో ఎస్పీబీ పాల్గొంటున్నారు. ఎస్పీబీతో పాటు జె.ఏసుదాసు ఈ షోలో పాటలు పాడనున్నారు. అలాగే విజయ్ ఆంటొని హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రం `తమిళరసన్`కు ఇళయరాజా సంగీతం అందిస్తుంటే.. అందులో ఓక పాటను ఎస్పీబీ ఆలపించారు. ఇప్పటికే రికార్డింగ్ పూర్తయింది.