Begin typing your search above and press return to search.

పద్మ అవార్డు వెనక్కు పై ఇళయరాజ క్లారిటీ

By:  Tupaki Desk   |   20 Jan 2021 4:15 AM GMT
పద్మ అవార్డు వెనక్కు పై ఇళయరాజ క్లారిటీ
X
సౌత్‌ ఇండియా మాత్రమే కాకుండా ఉత్తర భారతంలోనూ అభిమానులను సొంతం చేసుకున్న మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా కు ప్రసాద్‌ స్టూడియో వారికి జరిగిన వివాదం కోలీవుడ్‌ తో పాటు పలు సినీ పరిశ్రమల్లో చర్చనీయాంశం అయ్యింది. కొందరు ప్రసాద్‌ స్టూడియో వారిని సమర్థించగా కొందరు ఇళయరాజాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో కోర్టు ప్రసాద్‌ స్టూడియో వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇళయరాజాకు కాస్త ఇబ్బంది తప్పలేదు. ప్రసాద్‌ స్టూడియోలో ఉన్న తన అవార్డులు సంగీత పరికరాలను తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. కాని అప్పటికే వాటన్నింటిని ఒక స్టోర్‌ రూంలో వేశారని తనకు ఇచ్చిన రూంను కూల్చి వేశారని తెలిసి ఇళయరాజా చాలా బాధ పడ్డాడు. ఆ సమయంలోనే తన అవమానంకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషన్‌ అవార్డును వెనక్కు ఇవ్వాలనే నిర్ణయానికి ఇళయరాజా వచ్చాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కోర్టు తీర్పుకు నిరసనగా లేదంటే ప్రసాద్ స్టూడియో వారి చర్యకు నిరసనగా ఆయన ఈ పని చేయబోతున్నాడేమో అంటూ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన నుండి క్లారిటీ వచ్చింది. తాను పద్మ అవార్డును వెనక్కు ఇవ్వబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఎవరో కావాలని నా గురించి ఇలాంటి తప్పుడు కథనాలు అల్లుతున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు వచ్చిన సమయంలో చాలా మంది ఇళయరాజా ను ఆ విషయం ప్రశ్నించేందుకు కాల్స్ చేశారట. అందుకే ఆయనే స్వయంగా స్పందించాడు. ప్రసాద్‌ స్టూడియో వారితో వివాదానికి స్వస్థి చెప్పడంతో పాటు పద్మ అవార్డు విషయంలో కూడా ఇళయరాజా క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానుల్లో ఉన్న ప్రశ్నలన్నింటికి సమాధానం లభించినట్లయ్యింది.