Begin typing your search above and press return to search.
ప్రసాద్స్ స్టూడియోస్ పై ఇళయరాజా కోర్టు పోరాటం ఇంకా!
By: Tupaki Desk | 20 Dec 2020 2:30 PM GMTచెన్నై ప్రసాద్ స్టూడియోస్ తో మ్యాస్ట్రో ఇళయరాజా వివాదం గురించి తెలిసినదే. చెన్నయ్ కోడంబాక్కంలోని సదరు స్టూడియోస్ నుంచే రాజా సుదీర్ఘ కాలంగా రికార్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీలో లెజెండరీగా ఆయన చేసిన సేవలకు గుర్తింపు దక్కింది ఈ స్టూడియో నుంచే. అయితే అలాంటి స్టూడియోస్ నుంచి ఇళయరాజాకు చిక్కులు వచ్చి పడ్డాయి. తక్షణం స్టూడియోని ఖాళీ చేసి రాజా వెళ్లాలని ప్రసాద్ స్టూడియోస్ నివేదించింది. ఆ క్రమంలోనే ఆయన వ్యక్తిగత చాంబర్ (గది)ని ఖాళీ చేయించడంపై అప్పట్లో ఇళయరాజా కోర్టుకెక్కారు.
మాస్ట్రో తన రికార్డింగ్ గదిలోకి తనను అనుమతించేందుకు పరిష్కారం కావాలని కోర్టుకు అప్పీల్ చేసారు. ఏస్ సంగీతకారుడు తన రికార్డింగ్ గదిని యాక్సెస్ చేయడానికి గ్రాంట్ కోరుతూ కోర్టుకు అప్పీల్ చేశాడు. ఇళయరాజా బృందం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రసాద్ స్టూడియోలో టైటిల్ లేదా శాశ్వత స్థానం కోసం తాను క్లెయిమ్ చేయలేదని.. అయితే తన గదిలోకి మాత్రమే ప్రవేశించాలనుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
స్టూడియోలో ఆస్తి ఏదీ శాశ్వత స్వాధీనం కాదు. ముందస్తు నోటీసు లేదా సరైన సమాచారం లేకుండా తన వ్యక్తిగత గదిలో వస్తువుల్ని చట్టవిరుద్ధంగా పారవేయడం .. తనను చట్టవిరుద్ధంగా తిరస్కరించడంపై ఆయన న్యాయం కోరుతున్నారు.. ప్రసాద్ లాబ్స్ వాళ్ల పని చట్టబద్ధమైన ప్రక్రియకు అనుగుణంగా లేదు.. అంటూ లాయర్ నోటీస్ పంపారు.
గత సంవత్సరం డిసెంబర్ లో మద్రాస్ హైకోర్టు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు.. ప్రసాద్ స్టూడియోలోని అతని కూర్పు గదికి సంబంధించిన కేసులో మధ్యవర్తిత్వం వహించాలని నిర్ణయించింది. ఇళయరాజా ప్రాంగణాన్ని ఖాళీ చేయమని స్టూడియో వాళ్లు కోరినప్పుడు అదే ప్రాంగణంలో కొనసాగడానికి అనుమతించాలని కోరుతూ స్టూడియో యజమానులపై ఇళయరాజా కేసు పెట్టారు. అయితే స్టూడియో యాజమాన్యం అతనిని తన సాలిగ్రామం(స్టూడియోలో గది) ప్రాంగణం నుండి ఖాళీ చేయాలని కోరింది.
ఆ క్రమంలోనే ఇళయరాజా తన సొంత రికార్డింగ్ స్టూడియోను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారమైంది. ఆయన చెన్నై కోడంబకంలో ఒక థియేటర్ కొన్నారు. స్టూడియో నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అత్యాధునిక సుసంపన్నమైన స్టూడియోతో 2020 సెప్టెంబర్ లో దీన్ని ప్రారంభించాలని ఆయన భావించారు. కానీ కోవిడ్ 19 క్రైసిస్ కారణంగా ఆ పని చేయలేకపోయారని తెలుస్తోంది.