Begin typing your search above and press return to search.
కమల్ లో రాజకీయ బీజం నాటింది ఈయనేనట!
By: Tupaki Desk | 4 Feb 2019 8:38 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేసినట్లే. సుదీర్ఘ కాలంగా తమిళ సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుని యూనివర్శిల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. హీరోగా స్టార్ డం ఉన్న కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళ్లడంపై పలువురు పలు రకాలుగా స్పందించారు. అయితే కమల్ లో రాజకీయ బీజం నాటింది మాత్రం ఇళయరాజానట. అవును ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. నాలో రాజకీయ ఆలోచనలు కలగడంకు ప్రధాన కారణం ఇళయరాజా అంటూ కమల్ ప్రకటించాడు.
ఇళయరాజా 75వ పుట్టిన రోజు సందర్బంగా చెన్నైలో ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో తమిళ సినీ ప్రముఖులతో పాటు ఇంకా ఎంతో మంది పాల్గొన్నారు. ఏఆర్ రహమాన్ మరియు ఇళయరాజాలు ఈ వేదికపై సందడి చేశారు. ఇక కార్యక్రమంలో మాట్లాడిన కమల్ హాసన్ ఇళయరాజాపై ప్రశంసలు కురిపించారు. కమల్ మాట్లాడుతూ... ఇళయరాజా నాకు సోదర సమానుడు, నేను రాజకీయాల్లోకి చేరడానికి ఆయన సలహానే ప్రధాన కారణం. ఆయన నాకు గురువుతో సమానం అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదే వేదికపై రజినీకాంత్ కూడా మాట్లాడుతూ ఇళయరాజాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఎన్నో సినిమాల్లో అద్బుతమైన పాటలు ఇచ్చిన ఇళయరాజా గారు నా కంటే ఎక్కువగా కమల్ హాసన్ కు మంచి పాటలు ఇచ్చాడంటూ చమత్కరించాడు. ఆ సమయంలో ఇళయరాజా గారు మైక్ అందుకుని కమల్ నాకంటే రజినీకాంత్ కు ఎక్కువ మంచి పాటలు ఇస్తారు మీరు అంటాడు. మీ ఇద్దరికి నేను మంచి పాటలు ఇచ్చానని భావిస్తున్నాను అంటూ ఇళయరాజా సరదాగా వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేశారు. ఇళయరాజా పలు భాషల్లో కొన్ని వేలకు పైగా పాటలను ట్యూన్ చేశాడు. మ్యూజిక్ మ్యాస్ట్రోగా పేరు తెచ్చుకున్నారు.