Begin typing your search above and press return to search.
పోలీసుల మీద ఇళయరాజా ఆగ్రహం
By: Tupaki Desk | 24 May 2015 10:27 AM GMTతన పేరును ఇష్టారాజ్యంగా వాడేస్తున్న పలు ఎఫ్‌ఎం రేడియోస్టేషన్లు..ఆన్‌లైన్ సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తమిళనాడు పోలీసులను కోరుతున్నారు.
ఇప్పటికే ఇదే విషయంపై ఆయన పలుమార్లు తమిళనాడుపోలీసుల్ని సంప్రదించటం.. వారు తూతూమంత్రంగా వ్యవహరించటంపై ఆయన మండిపడుతున్నారు. తన అనుమతి లేకుండా.. తన పాటల్ని.. తన పేరును వాడుకోవటం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నప్పటికీ.. మద్రాసు పోలీసులు అంతగా స్పందించకపోవటంపై ఆయన తీవ్రమనస్తాపంతో ఉన్నట్లు చెబుతున్నారు.
తాజాగా.. తన పాటల్ని అక్రమంగా వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన తమిళనాడు రాష్ట్ర డీజీపీకి ఒక లేఖ రాశారు. తన అనుమతి ఏ మాత్రం లేకుండా ఒక ప్రముఖ ఎఫ్‌ఎం రేడియోస్టేషన్ తన పాటల్ని వాడుకుంటూ..రాత్రివేళల్లో ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రసారం చేయటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాతపూర్వకంగా తన అనుమతి లేకుండా సంగీతానికి సంబంధించి తన పేరు.. పాటలు వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇళయరాజా హెచ్చరిస్తున్నారు. మరి.. ఇళయరాజా మేధో చౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవటంలో పోలీసులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి.. ఇప్పటికైనా తమిళ పోలీసులు ఈ విషయం మీద స్పందిస్తారా?