Begin typing your search above and press return to search.
ఇళయ రాజా ఇందుకే రాజా..
By: Tupaki Desk | 4 Dec 2015 6:46 AM GMTచెన్నై పరిస్థితి ఇప్పుడెలా ఉందో మనకు తెలుసు. ఎక్కడికక్కడ అన్నీ స్తంభించిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కష్టాలు పడుతున్న విధానం వింటున్నా, చూస్తున్నా గుండె తరుక్కుపోతోంది. ఇంతటి కష్టం పగవాడికి కూడా రాకూడదని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు. వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ మాస్ట్రో ఇళయరాజాకు సాయం అంటే డబ్బులివ్వడంతో సంతోషం కనిపించలేదు. ఫుడ్ ప్యాకెట్స్ పంపించేస్తే తన బాధ్యత తీరిపోతుందని అనుకోలేదు. తను సుఖంగా ఇంట్లోనే కూర్చుని, సాయం పంపించే అవకాశం ఉన్నా సరే.. స్వయంగా బయల్దేరి వెళ్లారు. లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ స్కూల్ కి వెళ్లి అంద విద్యార్ధులు పడుతున్న కష్టాన్ని స్వయంగా చూశారు. వీలైనంతగా సాయం చేసి.. ప్రతీ ఒక్కరికి ఆహార పొట్లాలు అందించి వచ్చారు. ఇండస్ట్రీలో ఇళయరాజాకు మంచి వ్యక్తిగా పేరుంది. కానీ ఇంత వయసులోనూ ఇంత కష్టం పడడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే.. ఇందులో తనకు కష్టం ఏమే లేదని, సాయం చేయడం మనిషి నైతిక బాధ్యత అంటున్నారు ఇళయరాజా. ప్రజలు పడుతున్న కష్టంతో పోల్చితే.. తను చేస్తోంది చాలా తక్కువ అంటున్నారు ఈ మ్యూజిక్ మాస్ట్రో. దీంతో.. ఇళయరాజా ఈజ్ మహరాజా అంటూ ప్రశంసలు వస్తున్నాయి.