Begin typing your search above and press return to search.
ఇళయరాజా కూడా కరిగిపోయాడు
By: Tupaki Desk | 20 Sep 2015 11:30 AM GMTసంగీత దర్శకుడిగా ఇళయరాజా గొప్పదనం గురించి, ఆయన అందుకున్న శిఖరాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే వ్యక్తిగత విషయాల్లో ఇళయరాజా గురించి కోలీవుడ్ లో నెగెటివ్ గా మాట్లాడుతుంటారు. ఆయనకు పొగరెక్కువని.. ఎవ్వరినీ లెక్కజేయడని.. ఎవరినీ కలవడానికి ఇష్టపడరని అంటుంటారు. ఇళయరాజా మీడియా వాళ్లతో మాట్లాడరు, ఇంటర్వ్యూ లు కూడా ఇవ్వరు. తనను కలవాలని ఇంటి దగ్గరికి వచ్చే అభిమానుల్ని అస్సలు కనికరించరు. అలాంటి వ్యక్తి ఓ అభిమాని గురించి తెలుసుకుని చలించిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన తన వీరాభిమానిని కలుసుకుని అతడి చివరి కోరికను తీర్చారు.
తమిళనాట అంబత్తూరుకు చెందిన ఆర్ ఎస్ రవిచంద్రన్ (44) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆయన్ని బంధువులు చేరదీసి పోషించారు. కూలి చేసుకుని బతికే రవిచంద్రన్ కు ఇళయరాజా పాటలంటే ప్రాణం. ఆయన పాటలతో పాటు ఇంకో బలహీనత కూడా ఉంది. అదే ధూమపానం. విపరీతంగా బీడీలు, సిగరెట్లు తాగి ఒళ్లు గుల్ల చేసుకున్నాడు. రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు క్యాన్సర్ ముదిరిపోయిందని తేల్చారు. ఐతే ఇళయరాజా సంగీతమంటే చెవి కోసుకునే రవిచంద్రన్.. ఆయన్ని కలవడమే తన చివరి కోరికగా చెప్పాడు. ఈ సంగతి మీడియా ద్వారా ఇళయరాజాకు తెలిసింది. దీంతో తన మనుషుల్ని పంపి.. రవిచంద్రన్ ను తన రికార్డింగ్ థియేటరు దగ్గరికే పిలిపించుకున్నారు. అతణ్ని ఆప్యాయంగా పలకరించి తన పాట కూడా వినిపించారు.