Begin typing your search above and press return to search.
బాలు గురించి ఇళయరాజాను కదిపితే..
By: Tupaki Desk | 7 Sept 2017 6:31 PM ISTఒకప్పుడు ఇళయరాజా-బాలసుబ్రమణ్యం జోడీ పేరెత్తితే మధురమైన పాటలే గుర్తుకొచ్చేవి. వాళ్ల స్నేహ బంధమూ తలపుల్లోకి వచ్చేది. కానీ ఈ మధ్య వీళ్లిద్దరి గురించి ఒకేసారి మాట్లాడాల్సి వస్తే.. తన పాటల్ని అక్రమంగా వినియోగిస్తున్నాడంటూ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఇళయరాజా నోటీసులు పంపడానికి సంబంధించిన వివాదమే గుర్తుకొస్తోంది. రాయల్టీ విషయంలో మిగతా వాళ్లకు నోటీసులివ్వడం ఓకే కానీ.. తన మిత్రుడైన బాలుతో ఇళయరాజా మరోలా డీల్ చేయాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది సర్వత్రా. దీనిపై బాలు కూడా నొచ్చుకున్నట్లుగా మాట్లాడాడు. ఐతే ఇళయరాజా మాత్రం దీని గురించి ఎక్కడా స్పందించలేదు. ఆయన మీడియాకు దొరకలేదు కూడా.
ఐతే నవంబరు 5న హైదరాబాద్ లో తన కచేరి ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇళయరాజాకు బాలుతో వివాదానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి సమాధానం చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. ‘‘ఆ విషయాన్ని వదిలేద్దాం. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడలేను. స్పందించాల్సి వస్తే అది మరో రకంగా ఉంటుంది. అది నాకు.. ఆయనకు మధ్య వ్యవహారం. జనాలకు ఎందుకు? గొప్పవాళ్ల గొప్పదనం గురించి చెప్పకపోతే తప్పవుతుంది’’ అని బదులిచ్చారు ఇళయరాజా. ఈ వివాదం విషయంలో కొందరు పెద్దవాళ్లు మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఇళయరాజా - బాలసుబ్రమణ్యం మధ్య అంతరాన్ని తొలగించినట్లు చెన్నై వర్గాల సమాచారం.