Begin typing your search above and press return to search.
ఆ నోటీసులే బాలుని ఎంతో బాధపెట్టాయి!
By: Tupaki Desk | 25 Sep 2020 5:35 PM GMTసినీ సంగీత ప్రపంచంపై బాలు ఓ చెరగని సంతకం. ఆయన పాటన్నా.. మాటన్నా మధురమే. ఎన్నో వేల పాటలు పాడిన బాలు తన మధురమైన గొంతుని కొంత మంది ప్రముఖ నటులకు అరువిచ్చారు కూడా. తెలుగు- తమిళ- కన్నడ- హిందీ భాషలతో పాటు దాదాపు 11 భాషల్లో పాటలు పాడిన ఏకైక గాయకుడిగా బాలు చరిత్ర సృష్టించారు. ఇండస్ట్రీలో దర్శకరత్న దర్శకుడనే పదానికి ఎలా వన్నె తెచ్చారో అదే స్థాయిలో గాయకులకు గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బాలు.
తనని తాను ఉన్నతంగా భావించుకున్న ఆయనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలు వున్నాయి. గాన గంధర్వుడిగా అందరి మన్నలు పొందిన ఆయన ఓ సందర్భంలో తీవ్రంగా హార్ట్ అయ్యారు. గతంలో `సింహాసనం` సినిమా టైమ్ లో సూపర్ స్టార్ కృష్ణతో వివాదం ఏర్పడినా స్వయంగా ఆయనే కృష్ణ వద్దకు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకున్నారు.
అయితే తనకు అత్యంత ఆప్తుడు.. ఒరేయ్ అని పిలుచుకునేంత చనువున్న ఇళయరాజా వల్ల ఆయన హర్ట్ కావడం గమనార్హం. 2017లో బాలుకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. తన పాటలు పాడొద్దంటూ లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయాన్ని బాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కూడా. అయితే ఇళయరాజా వున్నఫలంగా బాలుకు లీగల్ నోటీసులు ఇవ్వడం వెనక ఓ ఆసక్తికరమైన స్తోరీ వుందని తెలిసింది. ఇళయరాజా తను ఏర్పాటు చేయాలనుకుంన్న సంగీత కచేరిలో పాటలు పాడాలని కోరారట. దానికి బాలు ఓ ఫిగర్ అమౌంట్ చెప్పడంతో ఇళయరాజా బాలుని పక్కన పెట్టి కొత్త వాళ్లతో పాటలు పాడించుకున్నారట.
ఆ తరువాత బాలు 50 నేరుతో దేశ విదేశాల్లో తనయుడు ఎస్పీ చరణ్‌తో కలిసి సంగీత కచేరికి ప్లాన్ చేశారు. అయితే ఆ కచేరి కోసం బాలు బృందం అమెరికా వెళ్లగా ఆ బృందం తన పాటలు పాడొద్దంటూ ఇళయరాజా నోటీసులు పంపడం అప్పట్లో కలకలం రేపింది. ఈ వయసులో ఇళయరాజా ఇలా చేస్తున్నారేంటి? తనే తన పేరుని చెడగొట్టుకుంటున్నారని విమర్శలు వినిపించాయి. ఈ విషయం తెలిసి బాలు నొచ్చుకున్నారట. ఇళయరాజా నోటీసులు ఇవ్వకుండా తనతో మాట్లాడితే పోయేదని బాధపడ్డారట.