Begin typing your search above and press return to search.

రాజా మళ్ళి వార్నింగ్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   28 Nov 2018 11:44 AM GMT
రాజా మళ్ళి వార్నింగ్ ఇచ్చారు
X
వెయ్యి సినిమాలకు పైగా మరపురాని అద్భుతమైన సంగీతాన్ని అందించిన మాస్ట్రో ఇళయరాజాకు వయసుతో సంబంధం లేకుండా అయన కెరీర్ డల్ అయ్యే నాటికి పుట్టిన పసికందులు కూడా యూత్ గా మారాక ఫ్యాన్స్ అయినవాళ్లు కోట్లలో ఉన్నారు. ఎఫ్ఎం రేడియో అయినా జర్నీలో సరదా వింటూ సాగే వెహికల్ అయినా ఖచ్చితంగా ఇళయరాజా పాటలు కొన్ని అయినా లేనిదే అది పరిపూర్ణం అనిపించుకోదు. ఇంతలా ప్రభావం చూపించిన మ్యూజిక్ లెజెండరీ ఈయన తర్వాత రెహమాన్ ఒక్కరే అని చెప్పొచ్చు.

ఆ మధ్య ఎస్పి బాలసుబ్రమణ్యం తన అనుమతి లేకుండా లైవ్ కన్సర్ట్ లో పాటలు పాడుతూ రాయల్టి రూపంలో చిల్లిగవ్వ కూడా చెల్లించడం లేదని బహిరంగంగా చెప్పడమే కాక లీగల్ గా నోటీసు పంపి సంచలనం రేపిన రాజా మరోసారి తన పాటలు వాడుకునే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా బయట కమర్షియల్ ప్రోగ్రామ్స్ లో చాలా మంది గాయని గాయకులు సంగీత దర్శకులు తన పాటలను విచ్చలవిడిగా పాడేస్తున్నారని అలా జరిగిన పక్షంలో చర్యలు తీసుకోక తప్పదని మరోసారి హెచ్చరిక జారీ చేసారు.

ఇళయరాజా ఈ కాపీ రైట్స్ విషయంలో చాలా లేట్ గా మేలుకొన్నారని చెప్పాలి. గతంలో కొన్ని వందల వేల కన్సర్ట్స్ లో ఆయన పాటలు ఇతరులతో పాడించి కోట్లు సంపాదించుకున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు చాలా ఉన్నాయి. బాలు వివాదం జరగక ముందే ఎందరో ఆ బాట పట్టారు లాభాలు చేసుకున్నారు. ఇది జరిగాకే బాలు గారు రాజా పాటలు అనుమతి లేకుండా పాడటం మానేశారు. గత ఏడాది నవంబర్ లో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా లైవ్ షో జరిగినప్పుడు బాలసుబ్రమణ్యం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒరేయ్ అని పిలుచుకునే చనువు ఇద్దరి మధ్య తగ్గిపోయింది. ఇప్పుడు రాజా మళ్ళి తన పాటల హక్కుల గురించి పబ్లిక్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ టాపిక్ మరోసారి చర్చలోకి వచ్చింది.