Begin typing your search above and press return to search.
అమ్మా నాన్న ఆటకి ఇళయరాజా పాట!
By: Tupaki Desk | 29 Nov 2015 9:30 AM GMTకమల్ హాసన్, ఇళయరాజా కలయికలో చాలా చిత్రాలొచ్చాయి. అన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. కొన్ని కారణాల వల్ల దశాబ్ద కాలంగా వారి కలయికలో సినిమాలు రాలేదు. తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ తదుపరి చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారట. ఒకసారి ఆ విశేషాల్లొకి వెళితే....
చాలా కాలం తర్వాత నేను అమల కలిసి అమ్మా నాన్న ఆట అనే చిత్రంలో నటిస్తున్నామంటూ తనే స్వయంగా ప్రకటించారు కమల్ హాసన్. దీనికి మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో మంచి హ్యుమర్ కూడా ఉంటుందట. ఇలాంటి కథకు ఇళయరాజా అయితే న్యాయం చేయగలరని భావించిన కమల్ హాసన్ తనని సంగీత దర్శకుడుగా అడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో షూటింగ్ ప్రారభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీంల విభిన్న దర్శకుడు బాలా దర్శకత్వంలో రూపొందుతున్న తారై తప్పటై చిత్రానికి సంగీతాన్ని అందించారట ఇళయరజా. ఈ చిత్రం ఆయనకు 1000వ చిత్రమట. అయితే డిసెంబర్ 17న ఈ ఆడియో విడుదల కానుందట. ఇళయరాజా 1000వ ఆల్బంగా వస్తున్న ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ లో ఆయనను ఘనంగా సత్కరించడానికి చిత్ర టీమ్ సన్నాహాలు చేస్తోంది. దీనికి దేశంలోని ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం.