Begin typing your search above and press return to search.

ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు.. వాళ్లకు షాక్

By:  Tupaki Desk   |   19 Feb 2022 5:32 AM GMT
ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు.. వాళ్లకు షాక్
X
సంగీత దర్శకుడు ఇళయరాజా ఎట్టకేలకు కోర్టులో గెలిచాడు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇళయారాజా పిటిషన్ పై ఎకో, ఆగీ ఆడియో సంస్థలకు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. కాపీ రైట్స్ విషయంలో ఇళయారాజా కోర్టులో గెలిచారు.

ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలను సీడీ, క్యాసెట్ రూపంలో విక్రయించడానికి ఎకో, ఆగి రికార్డింగ్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

అయితే ఈ ఒప్పందం కాలం ముగిసినా రెన్యూవల్ చేయకుండా ఆ సంస్థలు తన పాటలను విక్రయిస్తుండడంతో ఇళయరాజా ఆ సంస్థలపై 2017లో మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఎకో, ఆగి ఆడియో సంస్థలకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

దీంతో ఇళయరాజా మరోసారి అప్పీలు చేశారు. ఈ పిటీషన్ విచారించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అందులో ఒప్పందకాలం పూర్తి అయిన తర్వాత ఇళయరాజా పాటలను ఎకో, ఆగి రికార్డింగ్ సంస్థలు వాణిజ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై ఆడియో సంస్థలు బదులు పిటీషన్ వేసుకోవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 31వ తేదీకి వాయిదా వేసింది.

కాగా చాలాకాలంగా మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఇళయరాజా, ఆయన సోదరుడు అమరన్ ఇటీవల అనూహ్యంగా కలుసుకోవడం విశేషం.