Begin typing your search above and press return to search.

కుర్చీని చూసినా నన్నూ చూసినా ఒకటే

By:  Tupaki Desk   |   20 Feb 2016 5:31 AM GMT
కుర్చీని చూసినా నన్నూ చూసినా ఒకటే
X
ఓ హీరోయిన్ టాలీవుడ్ లో మెరుపులు మొదలుపెట్టి, బాలీవుడ్ లో మెప్పించేవరకూ వెళ్లిపోయిందంటే.. ఖచ్చితంగా అందగత్తె అవాలి, అలాగే నటనలోనూ ఆరితేరిపోవాలి. మరి ఆ రేంజ్ కి వచ్చాక, తమలో బోలెడంత బ్యూటీ దాగుందని అనుకోవడం హీరోయిన్ల నైజం. అసలు అమ్మాయిల మనసులో సహజంగా ఉండే భావన ఇది. కానీ గోవా బ్యూటీ ఇలియానా మాత్రం తానేం పెద్ద అందంగా ఉండనని అంటోంది.

చిన్నప్పుడు బాగా బొద్దుగా ఉండే ఇలియానా.. హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. అసలు తాను అందంగా, ఆకర్షణీయంగా ఉంటానని అనుకోవడమే లేదట ఈ సుందరి. 'నేను ఎట్రాక్టివ్ గా ఉంటానని, ఉండనడి అనను. కానీ తొలిచూపులోనే నచ్చేసేంత గొప్పగా మాత్రం ఉండనని నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే టేబుల్ ల్యాంప్ నో, కుర్చీనో మనం ఇష్టపడతామా? నేను కూడా వాటిలాగానే. ఎవరినీ ఎట్రాక్ట్ చేయలేను' అని ట్వీట్ చేసింది.

ఇల్లీ చెప్పిన ఈ సంగతులకు ఫ్యాన్స్ ఏ మాత్రం ఒప్పుకోలేదు. నువ్వు సూపర్, ఎట్రాక్టివ్.. యావరేజ్ కాదు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటావంటూ బోలెడన్ని రీట్వీట్స్ చేశారు. మరి బాలీవుడ్ లో మెప్పించగలిగేంత స్థాయి ఉండి కూడా.. ఇంకా తాను అందంగా ఉండడని అంటోందంటే.. అయితే సింప్లిసిటీ అవ్వాలి, లేదా ఇన్ఫీరియారిటీ అవ్వాలి. మరి ఈ రెండింటిలో ఇల్లీ బేబీ ఏ కోవకు చెందుతుందో?