Begin typing your search above and press return to search.
డోలె డోలె జరజరా.. పోకిరీని మర్చిపోలేకపోతోంది!
By: Tupaki Desk | 7 May 2022 2:30 AM GMTగోవా సుందరి ఇలియానా కెరీర్ ప్రారంభించింది టాలీవుడ్ లో. దేవదాస్ చిత్రంతో సూపర్ హిట్ డెబ్యూ గా కెరీర్ ని ప్రారంభించి పోకిరితో సూపర్ స్టార్ గా ఎదిగేసింది. అందుకే తన లైఫ్ లోనే స్పెషల్ మూవీ పోకిరి. ఈ చిత్రంలో మహేష్ తో ఇలియానా కెమిస్ట్రీ ఒక రేంజులో వర్కవుటైంది.
మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లో పాటల్లోనూ ఇల్లీ బేబి అంతే అందంగా కనిపిస్తుంది. ఈ భామ కెరీర్ మొదలై రెండు దశాబ్ధాలు పైగా అయినా ఇంకా పోకిరిని మర్చిపోలేకపోతోందంటే అర్థం చేసుకోవాలి. తాజా చిట్ చాట్ లో ఇలియానా తన ఫేవరెట్ సాంగ్ ఏది? అని ప్రశ్నిస్తే.. డోలె డోలె జరజరా అంటూ దక్షిణాదికి చెందిన సినిమాల్లో పోకిరి ఆప్షన్ ని ఎంచుకుంది. దీనిని బట్టి పోకిరి తనపై ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవాలి.
ఇలియానా డిక్రజ్ ఇటీవల `ఊ ఊ..` అనే పాటలో కనిపించింది. ఖరాన్ -సిద్ధేష్ పటోలే సాహిత్యంతో ఖరాన్ కంపోజ్ చేసి పాడారు. అర్బన్ కాంటెంపరరీ సాంగ్ ని విదిత్ చిత్రోడా రూపొందించారు. అవినాష్ జై సింగ్ దర్శకత్వం వహించారు. ఈ పాట ప్రమోషన్ల సమయంలో మీడియాతో ఇలియానా తనకు ఇష్టమైన పాటలను షేర్ చేసుకుంది.
రాపిడ్-ఫైర్ సెగ్మెంట్ సమయంలో ఇలియానా తనకు ఇష్టమైన హిందీ సినిమా పాటల్లో ఒకదాన్ని ఎంచుకోమని కోరగా.. ఫిర్ లే ఆయా దిల్ అని ఇలియానా తన చిత్రాలలో ఒకటైన బర్ఫీలోని పాటను పంచుకుంది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన 2012 చిత్రంలో రణబీర్ కపూర్ - ప్రియాంక చోప్రా కూడా నటించారు. ఈ చిత్రంలోని ప్రతి పాట హిట్ అయ్యింది.
తనకు ఇష్టమైన ఆంగ్ల పాటను వెల్లడిస్తూ, ``ఫ్రెండ్స్ బాన్ ఐవర్ (బై ఫ్రాన్సిస్ అండ్ ది లైట్స్)`` అని చెప్పింది. దక్షిణ భారత భాషలలో తన చిత్రాల నుండి తనకు ఇష్టమైన పాటలను పంచుకోవలసిందిగా కోరగా.. పోకిరి నుండి డోలే డోల్ .. రాఖీ నుండి జర జరా సాంగ్ లను ఎంపిక చేసుకుంది. ఈ రెండు చిత్రాలు 2006లో విడుదలయ్యాయి. పోకిరిలో మహేష్ బాబు సరసన ఇలియానా నటించగా.. రాఖీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది. ఇంకా ఇలియానాను తనకు ఇష్టమైన సంగీత శైలి గురించి అడిగినప్పుడు ఇలా ప్రతిస్పందించింది. నేను మళ్లీ మళ్లీ వినాలని అనిపించేది మూడీ విధమైన సంగీతం అని తెలిపింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇలియానా డి క్రజ్ తన తదుపరి చిత్రం అన్ ఫెయిర్ అండ్ లవ్లీ కోసం నటుడు రణదీప్ హుడా సరసన నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరిలో ఉంది. హర్యానా నేపథ్యంలో సాగే ఈ చిత్రం వర్ణ జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఓ మహిళ చేసే పోరాటాన్ని తెరపై ఆవిష్కరిస్తుంది. విద్యాబాలన్ - ప్రతీక్ గాంధీ మూవీకి పని చేసిన శ్రీషా గుహా ఠాకుర్తా దర్శకత్వంలో కూడా ఆమె కనిపిస్తుంది.