Begin typing your search above and press return to search.

సైజులు మారినా.. ఛాన్సులు రావడం లేదే

By:  Tupaki Desk   |   25 May 2016 3:30 PM GMT
సైజులు మారినా.. ఛాన్సులు రావడం లేదే
X
గోవా బ్యూటీ ఇలియానా ఆ మధ్య బాగా చిక్కిపోయింది. బాలీవుడ్ మోజులో పడి.. జీరో సైజ్ అందాల కోసం తెగ ఆరాటపడిపోయింది. ఓ సినిమా కాస్త ఆడేయగానే.. ముంబైలో మకాం వేసేసి అవకాశాల కోసం వెంపర్లాడింది. నాజూకు బాడీ కోసం ప్రయత్నించి మరీ నాసిరకంగా తయారవడంతో.. ఆఫర్లు రాలేదు సరికదా ఉన్న పేరు కూడా పోయింది.

అటు బాలీవుడ్ లో అవకాశాలు కనిపించక.. ఇటు టాలీవుడ్ వైపు అడుగులేసినా ప్రయోజనం కనిపించలేదు. ఫేమ్ ఉన్న సమయంలో టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడంతో.. అప్పుడెప్పుడో చేసిన జులాయి - దేవుడు చేసిన మనుషులు తర్వాత తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. గత ఐదేళ్లలో ఈ అమ్మడు బాలీవుడ్ లో వెలగబెట్టింది నాలుగంటే నాలుగు సినిమాలు. ఇప్పుడు చేతిలో ఉన్నది కూడా రుస్తొం మూవీ ఒకటే. అందుకే మళ్లీ తన పాత లుక్ వచ్చేసింది ఇల్లీ బేబీ. లుక్ కోసం సైజ్ ని అయితే పెంచగలిగింది కానీ.. అప్పుడున్న క్రేజ్ ని ఇప్పుడు సంపాదించుకోవడం అంత తేలిక కాదనే విషయం ఇంకా అర్ధం కాలేదు ఈ బక్క బ్యూటీకి.

అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం బాడీ పెంచేసి.. అందాలన్నీ తిరిగి తెచ్చేసుకున్నట్లు ఫీలింగ్ - కలరింగ్ ఇస్తున్నా.. సక్సెస్ ల జోష్ లో ఉన్నపుడు ఫేస్ లో కనిపించే కళ ఇప్పుడు లేదు. అందుకే సైజులు మారినా సినిమా ఆఫర్లు మాత్రం ఇల్లీ ఇంటికి రావడం లేదులే