Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బ్రేకప్పా తొక్కా.. అన్నట్టుంది!

By:  Tupaki Desk   |   5 Sep 2019 5:02 PM GMT
ఫోటో స్టొరీ: బ్రేకప్పా తొక్కా.. అన్నట్టుంది!
X
బ్రేకప్. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న మనుషులు విడిపోవడం. ఇండియాలో సహజంగా అబ్బాయి అమ్మాయి అనే అభిప్రాయం ఉంది. కానీ ఇదే అభివృద్ధి చెందిన దేశాలలో.. లేకపోతే మన ఇండియాలోనే ముంబైలాంటి టా..ప్ మెట్రో సిటీస్ లో ఆ బ్రేకప్ అనేది అమ్మాయి - అబ్బాయి మధ్య ఉండాలనే రూలేమీ లేదు. అమ్మాయి - ఆమ్మాయి మధ్య అయి ఉండవచ్చు. అబ్బాయి-అబ్బాయి మధ్య కూడా అయి ఉండొచ్చు. ఎక్కువ మంది ఒప్పుకోరు కానీ.. నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. ఈమధ్య హాట్ టాపిక్ అయిన బ్రేకప్ ఇలియానా డీ క్రజ్-అండ్రూ నీబోన్ బ్రేకప్.

బ్రేకప్ అయిన తర్వాత జనాలు ఏం చేయాలనేవి కూడా మన సభ్యసమాజంలో నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి. మగవాళ్లయితే గడ్డం పెంచి దిగాలుగా మందు తాగుతూ తిరగాలి. ఆడవాళ్లైతే దించిన తల ఎత్తకుండా ఉండాలి. ఆ బాధలో కనీసం ఒక ఏడాది కుంగి కృశించి పోవాలి. అయితే ఇలాంటి జఫ్ఫాయిజం ను మమ్మే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియా జెనరేషన్. ఒక్క రోజు.. మహా అయితే వారంలో లేదా నెలలో బ్రేకప్ నుంచి బైటకు వచ్చేసి జనాలు తమ పని తాము చూసుకుంటారు. ఇప్పుడు గోవా బ్యూటీ సరిగ్గా అలాంటి పనిచేయడంతో సంప్రదాయ వాదులకు రైల్వే స్టేషన్ లో ఉండే 10000 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్టు అయింది. బ్రేకప్ ఎప్పుడైందో మనకు తెలీదు. అందరికీ తెలిసింది మాత్రం నాలుగు రోజుల క్రితమే. అయితే ఇల్లీ బేబీ ఎక్కువ ఆలస్యం చేయకుండా తన సోషల్ మీడియాలో హాటు ఫోటోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో నెటిజన్లలో కలకలం మొదలైంది.

ఆ హాటు ఫోటోల ట్రెండ్ లో భాగంగా తాజాగా ఇల్లీ బేబీ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఇల్లీ ఒక కత్తి లాంటి వైట్ బికినీ ధరించి.. ఓ అందమైన శ్వేతవర్ణపు బోటుపైన పడుకుంది. సడెన్ గా చూస్తే ఏ రంభో ఊర్వశో వచ్చిందని అనుకుంటారు. అంత హాటుగా ఉంది. కానీ ఇది కొత్త ఫోటోలాగా కనిపించడం లేదు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఫోటోను పోస్ట్ చేసినట్టుగా ఉంది. అయితే ఈ ఫోటోకు ఇల్లీ బేబీ ఇచ్చిన క్యాప్షన్ "సూర్యుడు బయటకు వస్తాడని వేచి చూస్తున్నా". అంటే "రాత్రి చీకటికి చెల్లుచీటీ ఇచ్చాను. ఇప్పుడు నా జీవితంలోకి వెలుగు రాబోతోంది" అనే కదా అర్థం! ఈ ఫోటోలు.. ఈ క్యాప్షన్లు చూస్తుంటే ఒక్కటి మాత్రం చూచాయగా అర్థం అవుతోంది.. అదేంటంటే ఇల్లీ కి జనాలు జాలి చూపించడం నచ్చదేమో!