Begin typing your search above and press return to search.

అయ్యో రామా.. ఇల్లీ ఇలా..

By:  Tupaki Desk   |   3 May 2017 4:28 AM GMT
అయ్యో రామా.. ఇల్లీ ఇలా..
X
గోవా బ్యూటీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే భామ ఇలియానా. టాలీవుడ్ తో మొదలుపెట్టి.. ఇక్కడ స్టార్ ఇమేజ్ రాగానే బాలీవుడ్ ని ఏలేందుకు వెళ్లిపోయి.. హిట్స్ పడ్డా కెరీర్ లో ఆపసోపాలు పడుతూనే ఉంది. అసలే చిక్కినట్లుగా ఉండే ఇల్లీ.. బాలీవుడ్ వెళ్లాక మరీ బక్కచిక్కిపోయింది.

ఇలియానా లుక్స్ పై ఇక్కడ విమర్శలొచ్చాయి కానీ.. బాలీవుడ్ కోరుకునే ఫిగర్ ఇలానే ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టింపులు రాలేదు. కానీ ఇలియానా రీసెంట్ లుక్ చూస్తే మాత్రం ఎవరైనా షాక్ తినేయాల్సిందే. రీసెంట్ ఈ భామ ఔట్ డోర్ షాపింగ్ చేస్తూ ఫోటోలకు దొరికేసింది. ఈ గోవా భామ ఒళ్లంతా కండ బట్టేసి.. బాగా బొద్దుగా తయారైపోయింది. ఓ రోడ్ సైడ్ షాప్ లో కూరగాయలు కొంటున్న బొద్దు ఇలియానాను ఫోటోల్లో బంధించేశారు. ఫేస్ తో సహా మొత్తం లావుగా మారిపోయిన ఇలియానాను చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. నిన్న సాయంత్రం హైదరాబాద్ ఇన్ ఆర్బిట్ మాల్ లో ఒక ఫోన్ లాంచ్ చేయడానికి వచ్చిన ఇల్లీ.. తన లావు లుక్స్ తో పెద్దగా ఆక్టట్టుకోలేకపోయింది.

ఇంతగా ఇలియానా షేపులు మారిపోవడానికి కారణం ఏంటనే విషయం అంతు బట్టడం లేదు. పైగా అప్పుడప్పుడు తన ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ లవర్ తీసే ఫోటోలను షేర్ చేస్తున్న ఇలియానా.. వాటిని నెట్ లో షేర్ చేస్తూనే ఉంది. వాటిలో సన్నగానే కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇంత లావుగా ఎప్పుడు మారిపోయిందో.. అయ్యో రామా.. అంటున్నారు అభిమానులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/