Begin typing your search above and press return to search.

ఇలియానా ఎంత బోల్డ్‌ గా మాట్లాడిందంటే..

By:  Tupaki Desk   |   27 July 2016 7:05 AM GMT
ఇలియానా ఎంత బోల్డ్‌ గా మాట్లాడిందంటే..
X
కొందరి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి. కానీ రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి విషయాల్ని ఓపెన్ గా మాట్లాడ్డం ఇబ్బందే. ఐతే ఎవరి గురించి మాట్లాడుతామో వాళ్లకే మొహమాటం లేనపుడు.. వాళ్లే ఓపెన్ గా అన్నీ విప్పి చెప్పేస్తున్నపుడు ఇక రాయడానికి ఇబ్బంది ఏముంటుంది లెండి. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఏంటయ్యా అంటే.. గోవా బ్యూటీ ఇలియానా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా పెట్టిన ఓ పిక్ గురించే. ఇంతకీ ఈ ఫొటోలో ఏముందయ్యా అంటే..

ఇలియానా తన ఒంట్లోని ఒక్కో పార్ట్ ను ‘పెరుగుతావా’ అని అడుగుతుందట. దానికి జుట్టు.. కాళ్లు.. మెదడుతో పాటు ‘బూబ్స్’ కూడా ‘నో’ అనే బదులిస్తాయట. కానీ పొట్ట మాత్రం ‘ఓకే’ అంటాయట. అలాగే థైస్ కూడా ‘స్యూర్’ అంటాయట. మిగతావన్నీ పెరగమన్నా పెరగవని.. కానీ పొట్ట-థైస్ మాత్రం ఊరికినే పెరిగిపోతాయని బాధపడుతోంది ఇల్లీ బేబీ. గోవా భామే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించింది కాబట్టి ఆమెలో ఉన్న ప్రధానమైన ఓ లోపం గురించి మాట్లాడుకుందాం.

ఇలియానాలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి కానీ.. ఒక్క ఎద సౌందర్యం మాత్రమే తక్కువైందని సౌందర్య ప్రియులు మాట్లాడుకోవడం మామూలే. అది కూడా ఉండుంటే ఇలియానాకు తిరుగుండేది కాదని అంటారు జనాలు. ఈ విషయంలో ఇలియానాలో కూడా ఫీలింగ్ ఉన్నట్లుంది. అందుకే దీని గురించి ఓపెన్ గా మాట్లాడేసి జనాలకు షాకిచ్చింది. ఏమైనా బాలీవుడ్ వెళ్లాక ఇలియానా మరీ బోల్డ్ అయిపోయిందబ్బా. ఇంతకుముందోసారి బ్రా తీసి విసిరికొట్టి ఏదేదో చేసేస్తే ఎలా ఉంటుందో అంటూ ఇలాగే ఇన్ స్టా గ్రామ్ లో ఇల్లీ ఓ పిక్ పెట్టి జనాలకు దిమ్మదిరిగిపోయేలా చేయడం గుర్తుండే ఉంటుంది.