Begin typing your search above and press return to search.

బాయ్‌ ఫ్రెండ్‌ కూ భ‌ర్త‌కీ తేడా లేదా??

By:  Tupaki Desk   |   26 March 2018 12:24 PM GMT
బాయ్‌ ఫ్రెండ్‌ కూ భ‌ర్త‌కీ తేడా లేదా??
X
ఇలియానా... తెలుగు తెర మీద స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అనుభ‌వించిన గోవా బ్యూటీ. తెలుగులో కోటి రూపాయ‌ల పారితోషికం అందుకున్న మొద‌టి హీరోయిన్ కూడా ఇలియానానే అని చెబుతారు. అయితే హిందీ సినిమాల మీద మోజుతో టాలీవుడ్‌ను వ‌దిలేసి, బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డా స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బాయ్‌ ఫ్రెండ్‌ తో క‌లిసి తిరుగుతూ, ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ గ‌డుపుతోంది.

ఇలియానా ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆమె బాయ్‌ ఫ్రెండ్ గురించీ,వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం గురించే ఎక్కువ పోస్టులు చేసింది. బికినీ వేసుకుని సముద్రంలో ఈదుతున్న‌ప్పుడు ఆమె బాయ్‌ ప్రెండ్ ఆండ్రూ నీబోన్ తీసిన వీడియోను షేర్ చేసిన ఇల్లీ బేబీ - ఆ త‌ర్వాత ప్ర‌తి ఫోటోలోనూ అత‌ని ప్ర‌స్తావ‌న తీసుకొచ్చింది. తన తాజా ఫోటో కింద ‘‘నేను సిక్‌ గా ఉన్న‌ప్పుడు - అత‌ను చాలా జాగ్ర‌త్త‌గా - బాధ్య‌త‌గా చూసుకుంటాడు. బెస్ట్ హ‌స్బెండ్ ఎవ‌ర్‌’’ అంటూ పోస్ట్ చేసింది. బాయ్‌ ఫ్రెండ్‌ ను భ‌ర్త‌గా సంభోదించ‌డంతో ఇలియానా ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుందేమో... అనే అనుమానం వ్య‌క్తం అవుతోంది. పెళ్లి చేసుకున్నా, చేసుకోక‌పోయినా అత‌నితో స‌హ‌జీవ‌నం చేస్తోంది గ‌నుక అలా పిలిచి ఉండ‌వ‌చ్చ‌ని మ‌రికొంద‌రి వాద‌న‌.

తెలుగుతో పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్వ‌క‌త్వంలో ‘దేవుడు చేసిన మ‌నుషులు’ సినిమా త‌ర్వాత తెలుగులో సినిమాలేవీ ఒప్పుకోని ఇలియానా - హిందీలో న‌టించిన ‘రెయిడ్‌’ చిత్రం మార్చి 16న విడుద‌ల‌య్యి, మంచి క‌లెక్ష‌న్లు సాధించింది. ఈ చిత్రం త‌ర్వాత ప్ర‌స్తుతం ఇల్లీ బేబీ చేతిలో సినిమాలేవీ లేవు.