Begin typing your search above and press return to search.

ఎంత ఛేజ్ చేసినా వెలుగును క‌నిపెట్ట‌లేక‌పోతున్న ఇల్లీ!

By:  Tupaki Desk   |   12 April 2021 9:20 AM GMT
ఎంత ఛేజ్ చేసినా వెలుగును క‌నిపెట్ట‌లేక‌పోతున్న ఇల్లీ!
X
ఓవైపు సినిమాల్లేక ఖాళీగా ఉంది. ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ‌.. అటు హిందీ ప‌రిశ్ర‌మ‌లో ఆల్మోస్ట్ అవ‌కాశం అన్న‌దే లేదు. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఇల్లీ బేబి స‌న్నివేశం ఏమిటో అర్థం కాని ప‌రిస్థితి. ఇటీవ‌ల రిలీజైన `ది బిగ్ బుల్` కూడా ఓటీటీలో పెద్ద‌గా ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. ఈ సినిమాని ఇంత‌కుముందు రిలీజైన స్కామ్ 1992 తో పోలుస్తూ ది బిగ్ బుల్ లో ప‌స లేద‌ని క్రిటిక్స్ విమ‌ర్శించారు.

అయినా ఇలియానా మాత్రం ప్ర‌చారంలో ఎక్క‌డా త‌గ్గ‌నంటోంది. ఓవైపు ట్విట్ట‌ర్.. మ‌రోవైపు ఇన్ స్టా వేదిక‌గా ది బిగ్ బుల్ కి బోలెడంత ప్ర‌చారం చేస్తోంది. తాజాగా ది బిగ్ బుల్ గురించి ట్విట్ట‌ర్ లో ప్ర‌స్థావించిన ఇలియానా .. ``స్టాక్ మార్కెట్లో రికార్డులు తిర‌గ‌రాయ‌డం నుంచి టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వ‌డం వ‌ర‌కూ ది బిగ్ బుల్ చ‌రిత్ర సృష్టిస్తోంద‌ని.. ప్ర‌స్తుతం రికార్డుల గురించి మాట్లాడుతున్నార‌ని అంది. ఈ వ్యాఖ్య‌కు పెరుగుతున్న‌ గ్రాఫ్ ఈమోజీని షేర్ చేసింది. నిజానికి ఇలియానా చెబుతున్నంత ఈ సినిమాకి లేద‌న్న‌ది క్రిటిక్స్ వెర్ష‌న్. కానీ ఇల్లీ ప్ర‌చారం మాత్రం వేరే లెవ‌ల్లో ఉంద‌ని యూత్ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇన్ స్టా వేదిక‌గా ఇలియానా షేర్ చేసిన తాజా ఫోటోషూట్.. వీడియో షూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఆల్వేస్ ఛేజింగ్ ది లైట్ అన్న వ్యాఖ్య‌తో వైట్ అండ్ పింక్ డ్రెస్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇల్లీ య‌థావిధిగా బోల్డ్ అవ‌తారంలో క‌వ్వించింది అంటూ ఈ ఫోటోపై వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదే ఫోటోషూట్ వీడియోని బ్ల‌ర్ వెర్ష‌న్ షేర్ చేయ‌గా అది కూడా వైర‌ల్ గా మారింది.