Begin typing your search above and press return to search.

ఇలియానా ఎందుకంత ఫైర్ అయిందంటే..

By:  Tupaki Desk   |   22 Aug 2017 9:07 AM GMT
ఇలియానా ఎందుకంత ఫైర్ అయిందంటే..
X
అభిమానుల పేరుతో పిచ్చి వేషాలు వేస్తారా అంటూ ఇలియానా రెండు రోజుల కిందట ఎవరినో ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పబ్లిక్ ఫిగర్స్ అయింత మాత్రాన తమతో అనుచితంగా ప్రవర్తించే హక్కు లేదంటూ సోషల్ మీడియాలో ఫైర్ అయింది ఇలియానా. ఐతే ఈ గోవా బ్యూటీతో ఎవరు ఎక్కడ ఎందుకు అనుచితంగా ప్రవర్తించారన్నది ఆమె వెల్లడించలేదు. ఐతే ఓ నేషనల్ ఛానెల్ ఈ విషయమై ఇలియానాను వివరణ కోరగా అసలేం జరిగిందో ఆమె చెప్పింది.

ఇలియానా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్లో ఆగి ఉండగా.. ఆరుగురు యువకులు ఆమెతో మిస్ బిహేవ్ చేశారట. తమ కారు పక్కన వాళ్ల కారు కూడా ఆగి ఉందని.. ఇవతల ఉన్నది తాను అని గుర్తించాక ఆ కుర్రాళ్లు తన పేరు పలుకుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఇలియానా తెలిపింది. ఆ యువకులు జుగుప్సాకరంగా ప్రవర్తించారని.. ఒక వ్యక్తి కారు బానెట్ మీదికెక్కి అసభ్యకరంగా అరుస్తూ సంజ్న చేశాడని ఇలియానా తెలిపింది. సిగ్నల్ పడే వరకు ఆ కుర్రాళ్ల ఆగడాలు కొనసాగాయని ఆమె తెలిపింది. పబ్లిక్‌ లో మరీ ఇంత దిగజారి ఎలా ప్రవర్తిస్తారని ఇలియానా ప్రశ్నించింది. ఆ కుర్రాళ్ల ప్రవర్తన తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని.. ఐతే వాళ్ల పాపాన వాళ్లే పోతారని ఊరుకున్నానని గోవా బ్యూటీ చెప్పింది.