Begin typing your search above and press return to search.

అందాలను అలా వర్కవుట్ చేస్తోంది

By:  Tupaki Desk   |   3 Feb 2017 12:47 PM GMT
అందాలను అలా వర్కవుట్ చేస్తోంది
X
గోవా బ్యూటీ ఇలియానా ఫిట్నెస్ విషయంలో మహా స్ట్రిక్ట్ అనే విషయం తెలిసిందే. అమ్మడు మామూలుగా కూడా సన్నగానే ఉంటుంది కానీ.. బాలీవుడ్ వెళ్లాక జీరో సైజ్ ని కూడా ట్రై చేసేసింది. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా డ్రెసింగ్స్ మాత్రమే కాదు.. బాడీకి తగినట్లుగా వర్కవుట్స్ కూడా చేస్తుంది ఇల్లీ బేబీ.

రీసెంట్ ఇలియానా వర్కవుట్స్ కి సంబంధించిన ఫోటో ఇది. వైట్ టీ షర్ట్ వేసుకుని.. చెవులకు ఇయర్ ఫోన్ తగిలించుకుని పాపం ఎంత కష్టపడిపోతోందో కదా. రెండు చేతులు వెనక్కి కట్టేసినట్లుగా ఉన్నా.. అమ్మడి ఫేస్ లో ఉన్న ఫ్రెష్ నెస్ చూస్తుంటే.. ఇంతటి కష్టమైన వర్కవుట్స్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. బికినీలతో ఫోటోలు.. వీడియోల్లో దేహ సౌందర్యాన్ని ప్రదర్శించడం మాత్రమే కాదు.. అలాంటి బాడీ మెయింటెయిన్ చేసేందుకు ఎంత కష్టపడుతోందో ఇలా వర్కవుట్స్ చేస్తున్న ఫోటోలతో చెబుతోంది ఇలియానా.

గతేడాది అక్షయ్ కుమార్ తో కలిసి రుస్తోం అంటూ హిట్ కొట్టిన ఇలియానా.. ఈ ఏడాది బాద్షాహో మూవీలో అజయ్ దేవగన్ తోను.. అనిల్ కపూర్-అర్జున్ కపూర్ ల మూవీ ముబారకన్ లతోను బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/