Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: శ్రీవారితో షికారు
By: Tupaki Desk | 4 Nov 2018 5:26 PM GMTకాబోయే వాడితో డేటింగులు - షికార్లు అంటే అందులో ఉండే మజానే వేరు. సుదూర తీరాల్లో ఒంటరి దీవుల్లో షికార్లు చేస్తూ .. ఫోటోషూట్ లలో పాల్గొంటూ .. నచ్చినట్టు ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇటీవలి కాలంలో ఇలియానా చేసింది అదే. ఫిజీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నంత కాలం నిరంతరాయంగా వేడెక్కించే ఫోటోలతో విరుచుకుపడింది. సామాజిక మాధ్యమాల్లో వాటిని అభిమానులకు షేర్ చేసింది. రకరకాల మ్యాగజైన్ కవర్ పేజీలపై దర్శనమిచ్చింది.
అయితే ఆ ఫేజ్ ఇప్పుడు లేదు. ప్రస్తుతం ఇలియానాలో ఏదో ఊహించని మార్పు కనిపిస్తోందన్నది బాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. గత కొంతకాలంగా ఎక్స్ పోజింగ్ లెవల్స్ తగ్గాయి. అనవసర ఎలివేషన్లకు వెళ్లడం లేదు. ఇదివరకటిలా టైట్ ఫిట్ లు లేవు. పూర్తిగా లూజు దుస్తుల్లోనే ఎక్కడికి వెళ్లినా. ఇదంతా ఏదో తెలియని గమ్మత్తయిన మార్పు అంటూ మీడియా విశ్లేషిస్తోంది.
మొన్నటి రోజున ఇలియానా తన హబ్బీ ఆండ్రూ నీబోన్ తో కలిసి ముంబై - బాంద్రాలోని ఓ రెస్టారెంట్ కి ఈవెనింగ్ డేట్ కి వెళ్లింది. అక్కడ ఆండ్రూతో చేయి చేయి కలిపి ఈ అమ్మడు చాలా క్యాజువల్ గానే దర్శనమిచ్చింది. ఆ టైమ్ లో సరికొత్త గ్లో ఇలియానాలో కనిపించింది. అయితే ప్రియుడితో సహజీవనం ఇంకెన్నాళ్లు? దానికి చెక్ పెట్టి - పెళ్లి బంధంతో ఒకటి అవుతుందో లేదో చెప్పడం లేదు. ఇలియానా నటించిన `అమర్ అక్బర్ ఆంటోని` త్వరలో రిలీజ్ కి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ వేళ ఇలియానా అసలు గుట్టు ఏంటో తెలుస్తుందేమో! టాలీవుడ్ ఇంటర్వ్యూల్లో కచ్ఛితంగా ఓ ప్రశ్న మాత్రం ఉంటుంది. ఆండ్రూతో పెళ్లెప్పుడు? అన్నది ఆ ప్రశ్న.