Begin typing your search above and press return to search.
ఆ టైంలో దేవుడా అనిపించేసింది -ఇల్లీ
By: Tupaki Desk | 15 July 2017 6:05 AM GMTసెలబ్రిటీల జీవితాల్లో ఎంత ఫ్యాషనబుల్ గా.. ఎంత స్టైలిష్ గా ఉన్నా.. వారి లైఫ్ లోనూ తెగ ఇబ్బందిగా అనిపించేసిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి వాటి గురించి ఆ తర్వాతెప్పుడే చెప్పి అప్పటి క్షణాలను గుర్తు చేసుకుంటారు. గోవా బ్యూటీ ఇలియానా లైఫ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయట.
తెగ ఇబ్బంది పెట్టేసి.. దేవుడా అనిపించేసిన సందర్భం ఉందా అంటే.. 'ఒకటేంటి... ఇలాంటి ఎంబారిసింగ్ ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. మిగిలిన వాటిని లైట్ తీసుకున్నా ఓ రెండు సందర్భాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను' అని చెప్పింది ఇల్లీ బేబీ. 'బర్ఫీ మూవీ కోసం అవార్డ్ అందుకునేందుకు స్టేజ్ పైకి వెళ్లాను. ఆ టైంలో మొత్తం టీం అంతా అక్కడే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో నా డ్రెస్ వెనుక వైపు చీలిపోయింది. అయితే.. నేను మాత్రం ఏం జరగనట్లుగా మేనేజ్ చేశాను. సైలెంట్ నా అవార్డ్ తీసుకుని వచ్చేసి.. నా ఛైర్ లో కూర్చుండి పోయాను' అని చెప్పింది ఇలియానా.
'ఇలాంటిదే మరొకటి కూడా జరిగింది. ఓ బుక్ లాంచింగ్ ఈవెంట్ లో స్టేజ్ పైకి వెళుతున్నపుడు.. సరిగ్గా నా వెనుకవైపున డ్రెస్ చిరిగిపోయింది. అదృష్టం ఏంటంటే.. ఎవరూ ఆ విషయాన్ని గమనించలేదు. నేను కూడా ఏమీ రియాక్ట్ కాకుండా.. సాధారణంగానే కంటిన్యూ చేసేశాను. కనీసం ఎవరికీ అనుమానం కూడా రాలేదు' అని చెప్పిన ఇలియానా.. 'అలాంటి సమయాల్లో ఓవర్ రియాక్ట్ అయ్యి అందరికీ తెలియచెప్పే కంటే.. సైలెంట్ గా మన పని చేసుకుంటే.. ఎవరూ పసిగట్టలేరు' అంటూ సలహా కూడా ఇచ్చేసింది.